నోట్ల ర‌ద్దుపై జ‌గ‌న్ ద‌గ్గ‌ర మాట‌ల్లేవ్‌.. మాట్లాడ‌టాలు లేవ్‌..!

untitled-20

పెద్ద నోట్ల ర‌ద్దుపై దేశ‌మంతా గ‌గ్గోలు పుడుతోంది. ప్ర‌జ‌లంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క‌ట్ట‌ల కొద్దీ కోట్లు దాచుకున్న వాళ్లంతా వ‌ణికిపోతున్నారు. దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ నాయ‌కులు కూడా విభిన్న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. చాలామంది ముఖ్య‌మంత్రులు, ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన నేత‌లూ త‌మ త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డిస్తున్నారు. మ‌మ‌త‌, మాయ‌, ములాయం ఇలా చాలామంది ప్ర‌ధాని నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తున్నారు. మ‌రికొంద‌రు నేత‌లు మోడీకి అండ‌గా నిలుస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఏపీ సీఎం చంద్ర‌బాబు అయితే ఈ ఘ‌న‌త త‌న‌దేన‌ని తాను చెప్ప‌డంతోనే పెద్ద నోట్లు నిషేధించారని ప్ర‌చారం చేసుకుంటున్నారు.

అయితే, దేశం… రాష్ట్రం… ప్ర‌తి ఊరిలో ఇప్పుడు నోట్ల ర‌ద్దే చ‌ర్చ‌నీయాంశం. అయితే, ఒకే ఒక్క నేత మాత్రం సైలెంట్ అయిపోయారు. నోట్ల ర‌ద్దుపై నోరు తెరిచి మాట్లాడే సాహ‌సం చేయ‌డం లేదు. ఆయ‌నే ఏపీలో విప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. వైసీపీ త‌ర‌ఫున నోట్ల ర‌ద్దుపై మాట్లాడిన విజ‌య‌సాయిరెడ్డి మాత్రం మోడీ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించారు. మ‌రో బొత్స స‌త్య‌నారాయ‌ణ మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. అయితే, పార్టీలోని ఇద్ద‌రు కీలక నేత‌లు విభిన్నంగా స్పందించినా.. పార్టీ అధినేత జ‌గ‌న్ మాత్రం నోరెత్త‌లేదు. మోడీ నిర్ణ‌యం మంచిదో.. చెడ్డ‌దో చెప్ప‌లేదు. స‌రికదా క‌నీసం ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ ఒక ప్ర‌క‌ట‌న కూడా చేయ‌లేదు. నోట్ల ర‌ద్దు దేశ‌మంతా హాట్ టాపిక్ అయితే… ఏపీలో మాత్రం ప్ర‌తిప‌క్ష నేత మౌన‌మే చ‌ర్చ‌నీయాంశం.

Loading...

Leave a Reply

*