ఏకాకిగా మిగిలిన జ‌గ‌న్‌!

y-s-jagan

ఏపీలో విప‌క్ష నేత జ‌గ‌న్ ఏకాకి అవుతున్నారు. న‌వ్యాంధ్ర‌లో టీడీపీ, వైసీపీలు మాత్ర‌మే ప్ర‌ధాన పార్టీలు. కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలు, బీజేపీలు ఏదో నామ‌మాత్రంగానే ఉంటాయి. అయితే, ఇందులో ఒక్క జ‌గ‌న్ పార్టీ వైసీపీ మిన‌హా అంద‌రూ ఏపీకి వెళ్లిపోయారు. రాష్ట్ర విభ‌జ‌న‌ను ఘంటాప‌థంగా వ్య‌తిరేకించిన సీపీఎం విభ‌జ‌న జ‌రిగిన మ‌రుక్ష‌ణ‌మే త‌న పార్టీని విభ‌జించేసుకుని విజ‌య‌వాడ‌కు మ‌కాం మార్చింది. ఆ త‌ర్వాత కాంగ్రెస్ వెళ్లిపోయింది. క్ర‌మంగా అధికార పార్టీ కూడా విజ‌య‌వాడ చేరుకుంది. చివ‌ర‌కు ఇప్ప‌డు కాదు ఇంకా స‌మ‌యం కావాల‌న్న ఉద్యోగులు కూడా మెల్ల‌గా హైద‌ర‌బాద్ వ‌దిలేశారు. ఇక‌, సామాన్య జ‌నం అయితే, హైద‌రాబాద్‌తో రుణం తిరిపోయింద‌నుకున్న వాళ్లంతా ముందుగానే న‌గ‌రం వీడారు. ఇప్పుడు ఏపీకి, హైద‌రాబాద్‌కు పూర్తిగా బంధం తెగిపోయింది. అయితే, ఇవ్వాళో రేపో సీఎం కావాల‌నుకుంటున్న జ‌గ‌న్ మాత్రం హైద‌రాబాద్‌ను వీడ‌డానికి సుముఖంగా ఉన్న‌ట్లు లేదు.

ఏదో ఢిల్లీ నుంచి నేత‌లు వ‌చ్చి ఇక్క‌డ ఆందోళ‌న‌లు, స‌భ‌లు నిర్వ‌హించిన‌ట్లు అప్పుడ‌ప్పుడూ హైద‌రాబాద్ నుంచి ఏపీలోని ఏదోక జిల్లాకు వెళ్లి కార్య‌క్ర‌మాలు చేసి తిరుగుట‌పాలో రాత్రికి జ‌గ‌న్ హైద‌రాబాద్ చేరుకుంటున్నారు. ఏపీ ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వం, వివిధ పార్టీలు అంద‌రూ హైద‌రాబాద్ వ‌దిలేసినా జ‌గ‌న్ మాత్రం ఎందుకు లోట‌స్‌పాండ్‌ను వీడ‌డం లేద‌న్న‌ది ప్ర‌శ్నార్థకం. హైద‌రాబాద్ వీడ‌డానికే మీన‌మేషాలు లెక్కిస్తున్న జ‌గ‌న్… ఏపీ జ‌నాన్ని ఎలా ఆక‌ట్టుకుంటార‌న్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

Loading...

Leave a Reply

*