జ‌గ‌న్ బాంబు లోకేశ్‌పై పేలుతుందా?

jagan

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత త‌న శ‌త్రువును మార్చుకున్నారు. నిన్న‌టి వ‌ర‌కూ సీఎం చంద్ర‌బాబు టార్గెట్‌గా ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన జ‌గ‌న్ ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు లోకేశ్‌ను ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థిగా ఎంచుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. టీడీపీ ప్ర‌భుత్వంపై, చంద్ర‌బాబుపై జ‌గ‌న్ చేసిన‌, చేస్తున్న పోరాటం స‌రైన ఫ‌లితాలు ఇవ్వ‌డం లేద‌ని జ‌గ‌న్‌కు అర్థ‌మైంది. బాబు అక్ర‌మాల‌పై ఉద్య‌మం అంటూ గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైసీపీ కార్య‌క్ర‌మాన్ని పార్టీ నేత‌లే చాలా జిల్లాల్లో గ‌డ‌ప దాట‌ని ప‌రిస్థితి నెల‌కొంది. దాంతో ఆ కార్య‌క్ర‌మం ఎక్క‌డ జ‌రిగిందో… ఇంకా ఎక్క‌డ జ‌రుగుతుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. దాంతో ప్ర‌త్యేక హోదాపై కేంద్రం చెయ్యివ్వ‌డంతో హోదా ఉద్య‌మాన్నిచేప‌ట్టారు. ఇప్పుడు అది కూడా ప‌క్క‌కు పోయింది. స‌రిగ్గా ఈ స‌మ‌యంలోనే జ‌గ‌న్‌కు లోకేశ్ దొరికిపోయారు. పార్టీ శిక్ష‌ణా శిబిరంలో లోకేశ్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు డిప్యూటీ సీఎం లేచి నిల‌బ‌డి స‌మాధానాలిస్తున్న ఫొటో బ‌య‌ట‌కు రావ‌డంతో జ‌గ‌న్‌, ఆయ‌న అనుచ‌ర‌గ‌ణం అందివ‌చ్చిన అవ‌కాశాన్ని ఒడిసి ప‌ట్టింది.

లోకేశ్‌కు ఇమేజ్ పెంచాల‌నుకుని టీడీపీ నేత‌లే ఆ ఫొటోను అప్‌లోడ్ చేశారు. తీరా అది జ‌గ‌న్ చేతిలో ఆయుధం కావ‌డంతో ఆ ఫొటోను సైట్ నుంచి తీసేశారు. అయితే, అప్ప‌టికే వైసీపీ చేసిన ప్ర‌చారం జ‌నంలోకి వెళ్లింది. ఆ ప్ర‌చారాన్ని తిప్పి కొట్టేందుకు పార్టీలో సీనియ‌ర్ నేత‌లంతా రంగంలోకి దిగాల్సి వ‌చ్చింది. చంద్ర‌బాబును ఏమీ చేయ‌లేక‌పోతున్నాం కాబ‌ట్టి ఆయ‌న వార‌సుడు లోకేశ్‌ను అయినా ఇబ్బంది పెట్టాల‌ని జ‌గ‌న్ ఎత్తులు వేస్తున్నార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

Loading...

Leave a Reply

*