హైకోర్టునే న‌మ్ముకున్న జ‌గ‌న్‌

jagan

టీడీపీ ప్ర‌యోగిస్తున్న ఆప‌రేష‌ణ్ ఆక‌ర్ష్‌పై ప్ర‌తిప‌క్ష‌ నేత జ‌గ‌న్న్యాయ‌స్థానాల‌నే న‌మ్ముకున్నారు. ఇప్ప‌టికే ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పైహైకోర్టులో న్యాయ‌పోరాటం చేసిన వైసీపీ తాజాగా మ‌రోసారి హైకోర్టుత‌లుపుత‌ట్టింది. త‌మ పార్టీ టికెట్‌పై గెలిచి టీడీపీలోకి జంప్ అయినఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు తీసుకునేలా స్పీక‌ర్‌ను ఆదేశించాల‌ని కోరుతూ…వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర రెడ్డి హైకోర్టులో పిటిష‌న్ వేశారు. తాముచేసిన‌ఫిర్యాదుల‌పై స్పీక‌ర్ చ‌ర్యలు తీసుకోవ‌డం లేద‌ని, దీనిపై తగుఆదేశాలివ్వాల‌ని ఆయ‌న న్యాయ‌స్థానాన్ని కోరారు. గ‌తంలోనూ ఓసారి ఫిరాయింపుఎమ్మెల్యేల‌పై వేసిన పిటిష‌న్‌ను హైకోర్టు తోసిపుచ్చిన సంగ‌తి తెలిసిందే.అయితే, ఇటీవ‌ల తెలంగాణ స్పీక‌ర్‌కు న్యాయ‌స్థానం నోటీసులు ఇచ్చిననేప‌థ్యంలో ఏపీలో కూడా ఇదే తీరుగా న్యాయ‌స్థానం నుంచి ఆదేశాలుతెచ్చుకోవాల‌ని వైసీపీ భావిస్తోంది.

ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై ఏం చ‌ర్య‌లుతీసుకున్నారో తెల‌పాల‌ని సుప్రీం కోర్టు తెలంగాణ స్పీక‌ర్‌కు నోటీసులుజారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు బుడ్డారాజశేఖరరెడ్డి, ఆదినారాయణరెడ్డి, చాంద్‌బాషా, జి. రవికుమార్, జలీల్‌ఖాన్,సర్వేశ్వరరావు, వెంకటరమణ, మణిగాంధీ, పి.డేవిడ్‌రాజు, జయరాములు,అఖిలప్రియ, నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, వెంకట సుజయకృష్ణ రంగారావు,సునీల్‌కుమార్, వరుపుల సుబ్బారావులు స‌హా స్పీకర్, అసెంబ్లీకార్యదర్శులను ప్రతివాదులుగా పిటిషన్ లో పేర్కొన్న‌ట్లు వైసీపీ నేత‌లుతెలిపారు.

Loading...

Leave a Reply

*