తుని హింస‌లో జ‌గ‌న్ భాగ‌మెంత‌?

jagan

కాపు ఉద్య‌మం సంద‌ర్భంగా త‌లెత్తిన తుని హింస‌లో ఇప్ప‌టికే వైసీపీ నేత భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి సీఐడీ విచార‌ణ ఎదుర్కొంటున్నారు. భూమ‌న పాత్ర‌పై ఆధారాలు దొరికితే అత‌డిని అరెస్టు చేస్తామ‌ని సీఐడీ పోలీసులు కూడా చెబుతున్నారు. భూమ‌న అరెస్టు అయితే, ఆ వ్య‌వ‌హారం వైసీపీకి చుట్టుకున్న‌ట్లే. అయితే, ఇప్పుడు నేరుగా తుని హింస‌లో జ‌గ‌న్‌కూ పాత్ర ఉందంటూ ఆరోప‌ణ‌లు ముందుకొచ్చాయి. వైఎస్ జ‌గ‌న్‌కు భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి ద‌గ్గ‌రి బంధువ‌ని అందువ‌ల్ల తుని కుట్ర వెనుక జ‌గ‌న్ పాత్ర‌ను కూడా ప‌రిశీలించాల‌ని కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్ చ‌ల‌మ‌ల‌శెట్టి రామానుజ‌య డిమాండ్ చేశారు.

సీఐడీ త‌న‌ను విచారిస్తున్న విష‌యానికి సంబంధించి వివ‌ర‌ణ‌లు ఇచ్చుకోకుండా భూమ‌న చంద్ర‌బాబుపైనే ఆరోప‌ణ‌లు చేస్తుండ‌డాన్ని చ‌ల‌మ‌ల‌శెట్టి త‌ప్పుబ‌ట్టారు. బాబుకు గానీ, ఆయన తాత తండ్రులకుగానీ ఎలాంటి నేర చ‌రిత్రా లేద‌ని జగన్‌ కుటుంబానిదంతా నేర‌చ‌రిత్రేన‌న్న విష‌యం గుర్తు పెట్టుకోవాల‌ని రామానుజ‌య ధ్వ‌జ‌మెత్తారు. భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి కాపులపైనే దాడుల‌కు దిగార‌ని అలాంటి వ్య‌క్తి ముద్రగడ ప‌ద్మ‌నాభంకు ఎలా ఆత్మీయుడయ్యారని చ‌ల‌మ‌ల‌శెట్టి నిల‌దీశారు. తుని విధ్వంసంతో కాపు జాతికి చెడ్డ పేరు తెచ్చార‌ని దీనికి తాను బాద్యుడినో కాదో భూమ‌న రుజువు చేసుకోవాల‌ని ఆయన డిమాండ్ చేశారు.

Loading...

Leave a Reply

*