జ‌గ‌న్… చెప్పింది విన‌రు… వినిపించుకోరు!

jagan

వైసీపీ అధినేత‌పై ఆ పార్టీ మాజీ నేత‌లంద‌రిదీ ఒక‌టే మాట‌. ఆయ‌న మ‌నం చెప్పేది విన‌రు. ప‌ట్టించుకోరు. అప్పుడెప్పుడో పార్టీ నుంచి బ‌య‌ట‌కొచ్చిన జీవితా రాజ‌శేఖర్ నుంచి నిన్న‌టి జ్యోతుల నెహ్రు, భూమా నాగిరెడ్డి, ఇవ్వాళ్టి బూర‌గ‌డ్డ వేద‌వ్యాస్ ఇలా అంద‌రు నేత‌ల‌ది ఒక‌టే పాట‌. జ‌గ‌న్‌లో నియంతృత్వంలో ఉంది. ఆయ‌న చెప్పిందే నిజ‌మ‌నుకుంటారు. ఎవ‌రు చెప్పినా ప‌ట్టించుకోరు. క‌నీసం నేత‌లు చెప్పే విష‌యాల‌ను శ్ర‌ద్ధ‌గా ఆల‌కించ‌రు. అంటూ పార్టీ నుంచి బ‌య‌ట‌కొస్తున్న నేత‌లంతా ఇదే మాట ప‌ల్లు పోకుండా చెబుతున్నారు. కృష్ణా జిల్లాలోని పెడ‌న నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన బూర‌గ‌డ్డ వేద‌వ్యాస్ తాజాగా సైకిలెక్కారు. వైసీపీలో ఇమ‌డ‌లేకపోతున్నాన‌ని, అందుకే నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి టీడీపీ వ‌ల్లే అవుతుంద‌ని న‌మ్మి టీడీపీలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

గ‌త ఎన్నిక‌ల‌లో టీడీపీ నేత కాగిత వెంక‌ట్రావు చేతిలో ఓడిపోయిన వేద‌వ్యాస్ ఇప్పుడు అత‌డితో క‌లిసి ప‌ని చేయ‌డానికి సిద్ధ‌ప‌డ్డారు కానీ, జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఇమ‌డ‌లేక‌పోతున్నాన‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వెళ్లిన తాను అక్క‌డి ప‌రిస్థితిని జీర్ణించుకోలేకే బ‌య‌ట‌కు వ‌స్తున్నాన‌ని పేర్కొన్నారు. ప్ర‌ధాన విప‌క్షంగా వైసీపీ బాధ్యతగా ప‌నిచేయ‌లేక‌పోతుంద‌ని ఆరోపించారు. పట్టిసీమకు వ్యతిరేకంగా ప‌నిచేయొద్ద‌ని చెప్పినా జ‌గ‌న్ పెడచెవిని పెట్టారని వేద‌వ్యాస్ పేర్కొన్నారు.

Loading...

Leave a Reply

*