అన్న కూతురి పెళ్లికి వెళ్ల‌ని జ‌గ‌న్‌

jagan

గాలి జ‌నార్ద‌న్ రెడ్డి ఈ రోజు ఈ స్థాయిలో ఉండ‌డానికి ప్ర‌ధాన కార‌ణం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి. ఈ విష‌యాన్ని గాలి స్వ‌యంగా ప‌లుమార్లు వెల్ల‌డించారు. వైఎస్ కుమారుడు జ‌గ‌న్ త‌న‌కు సోద‌రుడితో స‌మాన‌మ‌ని ప‌లుమార్లు బ‌హిరంగంగా మీడియాకు చెప్పారు. ఆయ‌న చెప్పిన‌ట్లే గాలి, జ‌గ‌న్‌ల స‌బంధాలు చాలా స‌న్నిహితంగానే కొన‌సాగాయి. ఆ త‌ర్వాత గాలి జైలుకు వెళ్లారు. ఆయ‌న‌కు కొన‌సాగింపుగా జ‌గ‌న్ కూడా జైలుకు వెళ్లి వ‌చ్చారు. ఇలా జైలు జీవితం త‌ర్వాత గాలి, జ‌గ‌న్‌లు ఇద్ద‌రూ క‌లిసి క‌నిపించ‌డం త‌గ్గింది. అయితే, త‌మ మ‌ధ్య సోద‌ర బంధం మాత్రం కొన‌సాగుతుంద‌ని గాలి అప్పుడ‌ప్పుడూ వ్యాఖ్యానిస్తుంటారు.

ఈ క్ర‌మంలో బుధ‌వారం జ‌రిగిన గాలి జ‌నార్ద‌న్ రెడ్డి కుమార్తె బ్ర‌హ్మ‌ణీ పెళ్లి దేశ ప్ర‌జ‌లంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. దేశ విదేశాల నుంచి ఎంతోమంది ఈ పెళ్లికి హాజ‌ర‌య్యారు. అయితే, గాలి త‌న త‌మ్ముడు అని చెప్పుకునే జ‌గ‌న్ మాత్రం ఈ పెళ్లికి హాజ‌రు కాలేదు. ప్ర‌స్తుత నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో బ్లాక్ మ‌నీ వ్య‌వ‌హారంలో జ‌రుగుతున్న రగ‌డ నేప‌థ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అధిష్టానాలు త‌మ నేత‌లెవ‌రూ ఆ వివాహానికి హాజ‌రు కారాద‌ని మౌఖిక ఆదేశాలిచ్చినట్లు వార్త‌లొచ్చాయి. దాంతో ఒక‌రిద్ద‌రు మిన‌హా గాలి కుమార్తె పెళ్లిలో రాజ‌కీయ సంద‌డి పెద్ద‌గా క‌నిపించ‌లేదు. న‌ల్ల‌ధ‌నంపై ప్ర‌ధాని పోరు మొద‌లెట్టిన త‌ర్వాత బ‌య‌టెక్క‌డా క‌నిపించని జ‌గ‌న్… గాలి ఇంటిలో పెళ్లికి కూడా హాజ‌రు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Loading...

Leave a Reply

*