ప‌వ‌న్‌ను కాపీ కొడుతున్న‌జ‌గ‌న్‌!

pawan-and-jagan

ప్ర‌త్యేక హోదా పోరులో జ‌గన్ ఇప్పుడు జ‌న‌సేన బాట‌ప‌ట్టారు. ద‌శ‌ల‌వారీ పోరాటం చేస్తాన‌న్న ప‌వ‌న్‌నే వైసీపీ నేత ఆద‌ర్శంగా తీసుకుని ముందుకెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లున్నారు. కాకినాడ స‌భ త‌ర్వాత హోదా కోసం ఎంపీలు పోరాడాల‌ని అలా చేయ‌కుంటే వారు రాజీనామాలు చేయాల‌ని ప‌వ‌న్ డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. అప్పుడు తాను రంగంలోకి దిగుతాన‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. ఇప్పుడు జ‌గ‌న్ సేమ్ టూ సేమ్ డిమాండ్‌ను కాపీ కొట్టారు. ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం ఉదృతం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

అవ‌స‌ర‌మైతే త‌న ఎంపీల‌తో రాజీనామాలు చేయిస్తాన‌ని కూడా జ‌గ‌న్ చెప్పారు. ఇందుకోసం స‌రైన స‌మ‌యం కోసం ఎదురు చూస్తామ‌ని అది వ‌చ్చిన రోజున త‌న పార్టీ ఎంపీలు ప‌ద‌వుల‌ను వ‌దిలేసి ప్ర‌జాక్షేత్రంలోకి వ‌స్తార‌ని జ‌గ‌న్ చెప్పారు. ప్ర‌వాసాంధ్రుల‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన జ‌గ‌న్ ఈ మేర‌కు వారికి వివ‌రించారు. హోదా విష‌యంలో చంద్ర‌బాబు కేంద్రంతో రాజీ ప‌డ్డార‌ని మ‌రోసారి విమ‌ర్శించారు. తాము మాత్రం హోదా వ‌చ్చే వ‌ర‌కూ ఉద్య‌మిస్తామ‌ని జ‌గ‌న్ చెప్పారు.

Loading...

Leave a Reply

*