హిందీ రాక బాబు ఏం చేశారో చూడండి!

babu

ఏపీలో విప‌క్ష నేత జ‌గ‌న్ ఇటీవ‌ల చంద్ర‌బాబుకు ఇంగ్లీషు రాదంటూ ఎద్దేవ చేశారు. దానికి చంద్ర‌బాబు మండిప‌డ్డారు. కానీ జ‌గ‌న్ అలా కాకుండా బాబుకు ఇంగ్లీషు వ‌చ్చు… హిందీ రాద‌ని అని ఉంటే బాబు ఇంత‌గా జ‌గ‌న్‌పై మండిప‌డేవారు కాదేమో. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అది తెలిసే మాన వాళ్లకు హిందీ రాదండి ఏం చేస్తాం అని వ్యాఖ్యానించినా అంతా సైలెంట్‌గా ఊరుకోలా! ఇక అస‌లు సంగ‌తి చూడండి. ఢిల్లీలో జ‌రిగిన అపెక్స్ క‌మిటీ స‌మావేశంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చాలానే చోటు చేసుకున్నాయ‌ట‌. ఆ స‌మావేశంలో అంద‌రూ త‌న‌ను గౌర‌వించార‌ని, పెద్ద‌మ‌నిషిలా చూశార‌ని నాకు ఇవ్వాల్సిన గౌవ‌రం ఇచ్చార‌ని చంద్ర‌బాబే చెప్పుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఇంకో కొత్త సంగ‌తి బ‌య‌ల‌కు వ‌చ్చింది. ఆ స‌మావేశానికి నేతృత్వం వ‌హించిన కేంద్ర మంత్రి ఉమాభార‌తి త‌న ప్ర‌సంగాన్ని హిందీలో చేశార‌ట‌.

దాంతో మంత్రికి ఇంగ్లీషు రాద‌ని అందులో పాల్గొన్న ఇద్ద‌రు సీఎంల‌కు అర్థ‌మైంది. దాంతో కేసీఆర్ త‌న‌కొచ్చిన హిందీకి… ఇంగ్లీషు క‌లిపి కొట్టి మాట్లాడి మేనేజ్ చేశార‌ట‌. చివ‌ర‌కు బాబు వంతు వ‌చ్చేస‌రికి ఆయ‌న తిక‌మ‌క‌ప‌డ్డార‌ట‌. చంద్ర‌బాబుకు హిందీ మాట్లాడ‌లేరు మ‌రి. వ‌చ్చిన ఇంగ్లీషులోనే త‌ను చెప్పాల్సింది చెప్పేసి అధికారుల వైపు చూశార‌ట‌. వెంట‌నే వారు క‌లుగజేసుకుని బాబు చెప్పిన విష‌యాల‌ను ఉమాభార‌తికి హిందీలో వివ‌రించార‌ట‌. అంతా అయిపోయిన త‌ర్వాత హ‌మ్మ‌య్య అని ఊపిరి పీల్చుకుంటుండ‌గా… కేంద్ర అధికారులు చెప్పిన స‌మాధానంతో మ‌న అధికారులు, చంద్ర‌బాబు కంగుతిన్నార‌ట‌. ఉమాభార‌తికి ఇంగ్లీషు మాట్లాడ‌డం రాదు కానీ, అర్థ‌మ‌వుతుంద‌ని చెప్పార‌ట‌. ఆ విష‌యం విన్నాక‌… బాబుకు హిందీ అర్థ‌మ‌వుతుంది కానీ మాట్లాడ‌డం రాదన్న విష‌యం గుర్తుచేసుకుని ముసిముసి న‌వ్వులు నవ్వుకున్నార‌ట‌.

Loading...

Leave a Reply

*