సామాజిక యుద్ధం చేస్తున్న జ‌గ‌న్‌

jagan

గ‌త కొన్ని రోజులుగా జ‌గ‌న్‌, ఆయన పార్టీ నేత‌లు సామాజిక యుద్ధం చేస్తున్నారు. ప్ర‌భుత్వ లోటుపాట్ల‌పై ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం ఏ ప్ర‌తిప‌క్ష నేత అయినా చేసేదే. నిరంత‌రం ప్ర‌జ‌ల్లోకి వెళ్లి ధ‌ర్నాలు, ఆందోళ‌న‌లు చేసే బ‌దులు ఏపీలో జ‌గ‌న్ మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. సోష‌ల్ మీడియాను ఉప‌యోగించుకుంటూ ప్ర‌భుత్వంపై సామాజిక పోరాటానికి తెర‌తీశారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో నేటి త‌రం యువ‌త రోడ్ల‌పై పోరాటాల కంటే సోష‌ల్‌మీడియాలో పోస్టుల నిర‌స‌న‌కే ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ కూడా త‌న పార్టీ, అనుచ‌ర‌గ‌ణంతో ఈ సోష‌ల్ వేదిక‌నే ఉప‌యోగించుకుంటున్నారు. ఏ చిన్న అవ‌కాశం దొరికినా ప్రభుత్వాన్ని టీడీపీ నేత‌ల‌ను చీల్చి చెండాడేస్తున్నారు. ఆన‌క జ‌రిగిన విష‌యాల‌కు సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ర‌చ్చ‌కు ప్ర‌భుత్వంలోని పెద్ద‌లు, టీడీపీ నేత‌లు వివ‌ర‌ణ‌లు ఇచ్చుకుంటున్నారు.

నిన్న‌టి లోకేశ్‌, చిన‌రాజ‌ప్ప ఉదంత‌మైనా, టీడీపీ శిక్ష‌ణ‌లో కంప్యూట‌ర్‌లు ఆన్ చేయ‌లేద‌న్న విమ‌ర్శ‌లైనా సోష‌ల్ మీడియాలో జ‌రిగిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. చివ‌ర‌కు లోకేశ్ నేరుగా జ‌గ‌న్‌కు బ‌హిరంగ లేఖ రాయాల్సి వ‌చ్చింది. చిన‌రాజ‌ప్ప మీడియాకు వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. ఇక‌, మాజీ ఎంపీ గ‌ద్దె బాబూరావు కూడా త‌న కంప్యూట‌ర్ శిక్ష‌ణ గురించి వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. వీట‌న్నింటిలో కొస‌మెరుపు ఏమిటంటే సోష‌ల్‌మీడియా టీడీపీని విమ‌ర్శ‌ల పాలు చేసి ఫొటోలు టీడీపీ వారే వారి వెబ్‌సైట్‌లో పెట్టుకున్న‌వే కావ‌డం గ‌మ‌నార్హం. లోకేశ్ ఎదురుగా చిన‌రాజ‌ప్ప నిలుచుని మాట్లాడుతున్న ఫొటో టీడీపీ వెబ్‌సైట్‌లో చూసిన తర్వాతే నెటిజ‌న్లు రెచ్చిపోయారు. దాన్ని వైసీపీ నేత‌లు, జ‌గ‌న్ మీడియా అందిపుచ్చుకుంది. ఆ త‌ర్వాత జ‌రిగిన న‌ష్టం తెలుసుకుని టీడీపీ త‌న వెబ్‌సైట్ నుంచి ఆ ఫోటో తీసేసింది.

Loading...

Leave a Reply

*