మ‌ళ్లీ జ‌గ‌న్ నోట అదే మాట‌!

untitled-91

రాష్రంలో ఎన్నిక‌లు రావ‌డానికి ఇంకా రెండున్న‌రేళ్లు స‌మ‌యం ఉంది. ఇప్ప‌టికిప్పుడు ప్ర‌భుత్వం ప‌డిపోయే అవ‌కాశం ఉందా అంటే అదీ లేదు. ప్ర‌తిప‌క్ష పార్టీల నుంచే ఎమ్మెల్యేలు అధికార‌ప‌క్షంలో చేరుతున్నారు. అంటే అధికాప‌క్షం ఇంకా బ‌లోపేతం అవుతోంది. కానీ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ మాత్రం త‌న మానాన తాను క‌ల‌ల లోకంలో విహ‌రిస్తున్నారు. ఎప్పుడెప్పుడు సీఎం అయిపోదామా అని ఉవ్విళ్లూరిపోతున్నారు. ఎవ‌రిని ఆయ‌న క‌లిసినా… ఆయ‌న్ని ఎవ‌రు క‌లిసినా… జ‌గ‌న్ చెప్పే మాట ఒక్క‌టే. కాబోయే సీఎం నేనే. వ‌చ్చేది మ‌న ప్ర‌భుత్వ‌మే. అప్ప‌టి వ‌ర‌కూ ఓర్చుకోండి. రేపు నేను సీఎం కాగానే మీ క‌ష్టాల‌న్నీ తీర్చేస్తా. ఇదే మాట‌లు పొల్లుపోకుండా ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష నేత‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి జ‌గ‌న్ చెబుతూనే ఉన్నారు.

తాజాగా పులివెందుల‌లోని త‌న ఇంటిలో నిర్వ‌హించిన ప్ర‌జా ద‌ర్బార్‌లో జ‌నం బాధ‌లు విన్న జ‌గ‌న్ మ‌ళ్లీ ఇదే మాట‌లు వ‌ల్లెవేశారు. ప‌నిలోప‌నిగా ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. ఇది మాట‌ల ప్ర‌భుత్వ‌మే కానీ చేత‌ల ప్రభుత్వం కాదంటూ దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌జ‌లంతా కొన్నాళ్లు ఓపిక ప‌ట్టాల‌ని త‌మ ప్ర‌భుత్వం రాగానే అంద‌రి క‌ష్టాలు తొల‌గిపోతాయ‌ని జ‌గ‌న్ చెప్ప‌డాన్ని మాత్రంవైసీపీ నేత‌లే పెద‌వి విరుస్తున్నారు. ప్ర‌జ‌ల్లోకి వెళ్లి ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక‌ ప‌నుల‌ను వివ‌రించి వారి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకుంటే వాళ్లే జ‌గ‌న్ను సీఎం చేస్తారు కానీ… ఇలా క‌నిపించిన ప్ర‌తిఒక్క‌రి దగ్గ‌రా నేనే సీఎం అని చెప్పుకుంటు ఫ‌లితం ఏముంటుంద‌ని వారు త‌మ‌లె తామే స‌ణుక్కుంటున్నారు.

Loading...

Leave a Reply

*