రాజీనామాకు మోడీ రెడీ..?

untitled-3

నోట్ల ర‌ద్దుపై మోడీ చేసిన సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న ఇప్పుడు ఆయ‌న కుర్చి కింద‌కే నీళ్లు తెచ్చిన‌ట్లుంది. బ్లాక్ మ‌నీ అదుపు చేసేందుకే ఈ తీవ్ర నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్లు మోడీ ప్ర‌క‌టించారు. దాన్ని ప్ర‌జ‌లు కూడా తొలిరోజు మాత్ర‌మే ఆ కోణంలో అర్థం చేసుకున్నారు. రోజు గ‌డిచే కొద్ది నోట్ల ర‌ద్దుతో త‌మ‌కే ఇక్క‌ట్లు వ‌చ్చాయ‌ని సామాన్యుడికి అర్థ‌మ‌వ‌సాగింది. దీంతో ఇప్పుడు అంద‌రి దృష్టిలో మోడీ విల‌న్ అయిపోయారు. ప్ర‌త్య‌ర్థి రాజ‌కీయ పార్టీలు కూడా మోడీపై యుద్ధాన్ని ప్ర‌క‌టించాయి. దాన్ని జ‌పాన్ ప‌ర్య‌టన నుంచి రాగానే అర్థం చేసుకున్న మోడీ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్ర‌యోగించారు. బ‌హిరంగ వేదిక‌పై దాదాపు ఏడ్చినంత ప‌ని చేశారు.

ఆ త‌ర్వాత ప్ర‌తి స‌మావేశంలోనూ లేని బింకాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ వ‌చ్చారు. దేశంలోని సామాన్య ప్ర‌జ‌లంతా చిల్ల‌ర నోట్ల కోసం బ్యాంకుల ముందు ప‌డిగాపులు ప‌డే ప‌రిస్థితి ఎదుర‌వ‌డం… మోడీ చెప్పిన‌ట్లు బ్లాక్ మ‌నీ పోగేసిన‌ట్లు అనుమానిస్తున్న ఒక్క పెద్ద మ‌నిషి కూడా ఇబ్బంది ప‌డ‌క‌పోవ‌డం వంటి ప‌రిణామాలు మోడీని అంద‌రి దృష్టిలో శ‌త్రువును చేశాయి. ఈ క్ర‌మంలోనే ఏడు రోజులు గ‌డిచిపోయాయి. నేటి నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు కూడా ప్రారంభం అయ్యాయి. ప‌రిస్థితి చ‌క్క‌బ‌డుతుందిలే అని ఆశిస్తున్న మోడీకి ప‌రిస్తితి మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా మారుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

దాంతో పార్ల‌మెంట్ స‌మావేశాల‌లో విప‌క్షాల దాడిని అడ్డుకునేందుకు మ‌రోసారి జ‌నాన్ని త‌న‌వైపు తిప్పుకునేందుకూ ప్ర‌ధాని సంచ‌ల‌న‌మైన ప్ర‌క‌ట‌న చేయ‌నున్నార‌ని తెలిసింది. కావాలంటే తాను ప‌ద‌వి నుంచి వైదొల‌గిపోతాన‌ని చెప్పి అస్త్ర స‌న్యాసం చేయాల‌న్నా ఆలోచ‌న‌కు మోడీ వ‌చ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయినా మొండి ఘ‌టం అని పేరున్న మోడీ… పూర్తి మెజార్టీతో ప్ర‌ధాని పీఠం అధిరోహించిన మోడీ అంత తేలిగ్గా త‌న ప‌ద‌విని వ‌దిలేసుకోర‌న్న‌ది బీజేపీలోని ఉన్న‌త‌స్థాయి వ‌ర్గాల మాట‌. అదీ నిజ‌మే క‌దా.

Loading...

Leave a Reply

*