2 వేల రూపాయ‌ల‌ నోట్లు వెన‌క్కి తీసుకోనున్న మోదీ స‌ర్కార్..!

narendra-modi

కొత్త 2వేల నోటుతో కొత్త చిక్కులు వ‌చ్చిప‌డుతున్నాయి. అటు చిల్ల‌ర దొర‌క్క, మార్కెట్‌లోకి కావాల్సినంత చిన్న నోట్లు రాక‌… జ‌నాలు తెగ ఇబ్బంది ప‌డుతున్నారు. అయితే, 2వేల నోట్ల ముద్ర‌ణ‌లో దోషాలతో దానిని ర‌ద్దు చేయ‌నున్నార‌నే వార్త ఒక‌టి సోష‌ల్ మీడియాలో తెగ షికార్లు చేస్తోంది. అదేంటంటే… కొత్త 2వేల రూపాయ‌ల నోటుపై హిందీ భాష‌లో ముద్రించేట‌ప్పుడు రెండు చోట్ల రెండు భిన్న‌మైన రూపాల‌లో ముద్రించడం జ‌రిగింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటు, చంద్ర‌బాబు ప‌లువురు రాజ‌కీయవేత్త‌లు, మ‌రికొంద‌రు ఆర్దిక వేత్త‌లు కూడా 2వేల రూపాయ‌ల నోటుతో అవినీతి మ‌రింత పెరిగే చాన్స్ ఉంద‌ని అభిప్రాయ ప‌డుతున్నారు. దీనిపై మోదీతో కూడా మాట్లాడ‌తాన‌న్నారు చంద్ర‌బాబు.

అయితే నోటు ర‌ద్దు వెనుక ఉన్న అస‌లు రీజన్ మాత్రం వేర‌ట‌. ఈ నోటుపై ఒక‌సారి దోన్ హ‌జార్ రూపియా అని ఓసారి, దోన్ హాజార్ రూప‌యే అని మ‌రోసారి అక్ష‌ర దోషాల‌తో ముద్రించిన‌ట్లు సోషల్ మీడియాలో రూమ‌ర్‌లు బ‌య‌ల్దేరాయి. దీంతో, ఈ నోటును ర‌ద్దు చేసి దాని స్థానంలో కొత్త నోటును ప్ర‌వేశ పెట్టబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కొంద‌రు మాత్రం ఇదంతా త‌ప్పుడు ప్ర‌చార‌మ‌ని కొట్టిపారేస్తున్నారు. ఇందులో త‌ప్పేమీ లేద‌ని, ఏ నోట్ పై అయినా 15 భాషల్లో ఆ నోటు విలువను తెలిపేలా రాస్తారు. కొత్త‌గా వ‌చ్చిన‌ 2000/- నోట్ పై కూడా అలాగే రాశారు. దోన్ హాజార్ రుపియా అనేది ఒకటి కొంకణీ లాంగ్వేజ్ ది, మరో దోన్ హాజార్ రుపియే అనేది మరాఠి లాంగ్వేజ్ ది, హిందీ జాతీయ భాష కాబట్టి దానిని సెపరేట్ గా దో హజార్ రుపియే అని రాశారు. అంతేత‌ప్ప‌.. ఇందులో పెద్ద త‌ప్పేమీ లేద‌ని అంటున్నారు. సో.. 2వేల రూపాయ‌ల నోటు ర‌ద్దు కాన‌ట్టేనా…?

Loading...

Leave a Reply

*