అమెరికాలో నిర‌స‌న‌ల వెల్లువ‌.. అధ్య‌క్షుడిగా ట్రంప్‌ని తొల‌గిస్తార‌ట‌…!

untitled-19

అమెరికా అధ్య‌క్ష పీఠం కోసం హోరాహోరీగా సాగిన పోరులో రిప‌బ్లిక‌న్ పార్టీ అభ్య‌ర్ధి డొనాల్డ్ ట్రంప్ ఘ‌నవిజ‌యం సాధించారు. ముందునుంచి రేస్‌లో ఉన్న హిల్ల‌రీ క్లింటన్‌ని మ‌ట్టి క‌రిపించి ఆయ‌న ప్రెసిడెంట్‌గా ఎన్నిక‌య్యారు. అయితే, ట్రంప్ విజయాన్ని జీర్ణించుకోలేని కొంద‌రు అమెరికాలో నిర‌స‌న బాట ప‌ట్టారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో అయితే ఏకంగా త‌మ‌ను ప్ర‌త్యేక దేశంగా గుర్తించాల‌ని డిమాండ్ చేశారు. ఈ ఆందోళ‌న‌లు, నిర‌స‌నలు రోజు రోజుకీ పెరుగుతున్నాయే కానీ, ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. దీనిపై ట్రంప్ ఆగ్ర‌హం కూడా వ్య‌క్తం చేశాడు. ఇవి కొంద‌రు కావాల‌నే చేస్తున్న ప‌నికిమాలిన ప‌ని అని తెలిపారు.

ఈ నిర‌స‌న‌లు అంత‌కంతకూ పెరుగుతుండ‌డంతో అమెరికాలో కొత్త వాద‌న తెర‌పైకి వ‌స్తోంది. కాబోయే అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌ని వెంట‌నే అభిశంస‌న ప‌లికి.. గ‌ద్దె దింపాల‌ని భావిస్తున్నార‌ట‌. దీనిపై అమెరికా ప్రొఫెస‌ర్‌, ప్ర‌ముఖ దైవ‌జ్ఞుల‌లో ఒక‌ర‌యిన అలాన్ లిచ్‌మేన్ జోస్యం చెప్పారు. అమెరికా డొనాల్డ్ ట్రంప్ త్వ‌ర‌లోనే అభిశంస‌న‌ల‌కు గురి కాబోతున్నార‌న్నారు. రిప‌బ్లిక‌న్ పార్టీ ట్రంప్‌ని తొల‌గించి ఆయన స్థానంలో న‌మ్మిన‌బంటును నియ‌మిస్తుంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇది త‌న భావ‌న మాత్ర‌మే అని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

రిప‌బ్లిక‌న్ పార్టీలోనే ట్రంప్‌పై నిర‌స‌న గ‌ళం మొద‌ల‌యిందట‌. ఆయ‌న‌ను ఇష్ట‌ప‌డే వాళ్లు కూడా త‌గ్గిపోయార‌ని చెబుతున్నారు. మ‌రోవైపు, రిపబ్లిక‌న్ పార్టీ ఉపాధ్య‌క్షుడుగా గెలిచిన పెన్స్‌ను ఆ పార్టీ అమితంగా ఇష్ట‌ప‌డ‌తారని, ఆయ‌న‌యితే చెప్పిన‌ట్లు వింటార‌ని భావిస్తోంది. మ‌రోవైపు, న్యూయార్క్ ప‌త్రిక విలేఖ‌రి ఒక‌రు.. వ‌చ్చే ఏడాది ట్రంప్‌తో రాజీనామా చేయించ‌డం లేదా, అభిసంశ‌న ద్వారా తొల‌గించే అవ‌కాశం ఉంద‌ని ఓ కాల‌మ్‌లో రాశారు. ఈ ఎన్నిక‌ల‌లో ట్రంప్ గెలుస్తార‌ని అంద‌రికంటే ముందే ఊహించిన లిస్ట్‌లో లిచ్‌మ‌న్ ఉన్నారు. అలాంటి వ్య‌క్తి తాజాగా ట్రంప్‌ని అభిసంశించే రోజు ద‌గ్గ‌ర్లోనే ఉంద‌ని చెప్ప‌డం విశేషం. ఇదే జ‌రిగితే అమెరికాలో ఇది ఓ రికార్డ్ అవుతుంది.

Loading...

Leave a Reply

*