అమెరిక‌న్ల‌ను గెలిచిన ఇండియ‌న్లు

indians

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్ర‌పంచ‌మంతా ఎంత సంచ‌ల‌న క‌లిగించాయో… భార‌త్‌కు అంత ఆనందాన్ని మిగిల్చాయి. ప్ర‌పంచాన్ని నివ్వెర‌ప‌రుస్తూ… ట్రంప్‌ను విజ‌య తీరం చేరుస్తూ త‌న ఓటు ఆయుధాన్ని ప్ర‌యోగించి స‌గ‌టు అమెరిక‌న్ సంచ‌ల‌నాన్ని క్రియేట్ చేశాడు. అలాగే, భార‌తీయుల‌పై త‌మ‌కున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఈసారి జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లో ఐదుగురు భార‌తీయ అమెరిక‌న్లు చ‌ట్ట‌స‌భ‌ల‌కు ఎన్నికై చ‌రిత్ర సృష్టించారు. వివిధ రాష్ట్రాల‌కు చెందిన న‌లుగురు ప్ర‌తినిధుల స‌భ‌కు ఎంపిక‌య్యారు. మ‌రొక‌రు నేరుగా సెనెట్‌కు ఎన్నికై చ‌రిత్ర‌లో నిలిచిపోయారు. కాలిఫోర్నియా నుంచి భార‌తీయ అమెరిక‌న్ క‌మ‌లా హారిస్ సెనెట‌ర్‌గా ఎన్నికై రికార్డు నెల‌కొల్పారు.

అలాగే ప‌లు రాష్ట్రాల నుంచి డాక్టర్‌ అమీ బెరా, ఆర్‌వో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్‌లు విజ‌య‌దుంధుబి మోగించి ప్ర‌తినిధుల స‌భ‌లో అడుగుపెట్ట‌బోతున్నారు. వీరిలో కమలా హారిస్‌, కృష్ణమూర్తి, అమీ బెరా అభ్యర్థిత్వానికి ప్రస్తుత అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మద్దతు తెలిపారు. ‘‘కమలా హారి్‌సను సెనేట్‌కు పంపితే.. కాలిఫోర్నియా ప్రజల తరఫున ఆమె నిరంతరం నిర్భయంగా పోరాడతారు’’ అని ఒబామా కితాబునిచ్చారు. ప్రమీలా జయపాల్‌ను సెనేటర్‌ బెర్నీ శాండర్స్‌, అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ బలపరిచారు. ఒబామా పార్టీకి ఓట‌ర్లు ప‌రాజ‌యం పాలు చేసిన ఆయ‌న బ‌ల‌ప‌రిచిన ఎన్ఆర్ఐ క‌మ‌లా హారీస్‌కు జై కొట్టారు. ఇది నిజంగా భార‌తీయుల ఘ‌న‌తే.

Loading...

Leave a Reply

*