మోదీ ఎస్ అంటే.. స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్ వీడియో-ఆర్మీ..!

untitled-7

స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్‌.. జ‌రిగాయా?  లేదా.? జ‌రిగితే.. వీడియో బ‌య‌ట‌పెట్టొచ్చుగా…?  గ‌త రెండు మూడు రోజులుగా విప‌క్షాలు చేస్తున్న రాద్దాంతం ఇది. పీఓకేలోని ఉగ్ర‌వాద శిబిరాల‌పై కొన్ని రోజుల క్రితం భార‌త ఆర్మీ దాడులు నిర్వ‌హించింద‌ని తెలిపింది. ఈ దాడిలో 38 మంది ఉగ్ర‌వాదులు మ‌రణించార‌ని, ఎనిమిది టెర్ర‌రిస్ట్ శిబిరాలు ధ్వంస‌మ‌య్యాయ‌ని ఆర్మీ ప్ర‌క‌టించింది. అయితే, ఆ త‌ర్వాత నుంచి వీటిపై రాజ‌కీయ ర‌గ‌డ మొద‌ల‌యింది. నిన్న కేజ్రీవాల్‌, అంత‌కుముందు కాంగ్రెస్ నేత‌లు.. ఒక‌రితో ఒక‌రు పోటీప‌డి.. స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్ జ‌ర‌గ‌లేద‌ని ఆరోపిస్తున్నారు. ఇది కేవ‌లం బీజేపీ త‌న ఇమేజ్‌ని పెంచుకునే ఎత్తుగ‌డ మిన‌హా మ‌రేమీ కాద‌ని వారు వాదిస్తున్నారు. ఇటు పాకిస్తాన్ కూడా ఇదే వాద‌న‌ను చేస్తోంది. భార‌త్ ఆర్మీ త‌న భూభాగంలోకి చొచ్చుకురాలేద‌ని, స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్ జ‌ర‌గ‌లేద‌ని వితండ‌వాదం చేస్తోంది. దేశంలో త‌న ప‌రువు కాపాడుకునే ప్ర‌యత్నం చేస్తోంది.

అయితే, ఇటు బీజేపీ మంత్రులు మాత్రం దాడులు జ‌రిగాయ‌ని, మీరు ఆర్మీనే అనుమానిస్తారా?  వారి స్థ‌యిరాన్ని నీరు గారుస్తారా? అంటూ దెప్పిపొడిచింది. రెండు రోజులుగా సాగుతున్న ఈ ఆరోప‌ణ‌లు,ప్ర‌త్యారోప‌ణ‌ల‌కు సమాధానం చెబుతానంటోంది భార‌త ఆర్మీ. ప్ర‌ధాని మోదీ ఎస్ అంటే.. స‌ర్జిక‌ల్ స్ట్రయిక్స్ వీడియోని బ‌య‌ట‌పెడ‌తామ‌ని చెబుతోంది. ఆ వీడియో బయటపెడితే ఇటు దేశంలో ప్రశ్నిస్తున్నవాళ్లతో పాటు పాకిస్థాన్‌ నోరు కూడా మూయించినట్లు అవుతుందని ఆర్మీవర్గాలు భావిస్తున్నాయి.మొత్తం ఆపరేషన్ అంతటినీ మానవరహిత విమానాల సాయంతో షూట్ చేయడంతో పాటు ఆ దృశ్యాలను ప్రధానమంత్రి, మరికొందరు ఉన్నతాధికారులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా రాత్రంతా మేలుకొని మరీ చూసిన సంగతి తెలిసిందే.

ఆ విషయాలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్‌సింగ్ ఒక్కరే అధికారికంగా బయటకు వెల్లడించారు. అక్కడి పరిస్థితి ఇప్పటికీ ఇంకా ‘లైవ్’గానే ఉందని, అయినా కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయని ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా అన్నారు. ఇప్పుడు పరిస్థితి ఇంకా చాలా సున్నితంగా ఉందని, అందువల్ల దీనిపై ఎలాంటి విషయాలూ తాను చెప్పడం సరికాదని ఆయన తెలిపారు.  ఆ వీడియోల కోసం జ‌నాలు కూడా ఎగ్జ‌యిటింగ్‌గా ఎద‌రు చూస్తున్నారు. పాక్ ఉగ్ర‌వాద మూలాల్ని భార‌త్ ఎలా తుత్తునియ‌లు చేసిందో క‌ళ్లారా చూడాలని భార‌తీయులు కోరుకుంటున్నారు. మ‌రి, ఆ వీడియోల‌ని ఆర్మీ ఎప్పుడు రిలీజ్ చేస్తుందో చూడాలి.

Loading...

Leave a Reply

*