వివాదంలో గాలి కూతురు పెళ్లి!

untitled-6

అంగ‌రంగ‌వైభ‌వంగా చేయాల‌నుకున్న పెళ్లి కాస్తా వివాదాల మ‌యం అయ్యింది. ప‌ద‌కొండు రోజులు ప్ర‌పంచ‌మంతా అబ్బుర‌ప‌డేలా నిర్వ‌హించాల‌నుకున్న వేడుక‌పై ఇప్పుడు నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. మైనింగ్ కింగ్ గాలి జాన‌ర్ద‌న్ రెడ్డి కుమార్తె పెళ్లిపై దేశ‌మంతా పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది. మైనింగ్ కింగ్‌గా పేరుగాంచిన‌ గాలి జనార్ధనరెడ్డి అక్రమ మైనింగ్ కేసులో జైలు శిక్ష అనుభవించి ప్ర‌స్తుతం బెయిల్‌పై బ‌య‌టున్నారు. త‌న కుమార్తె పెళ్లిని ఘ‌నంగా నిర్వ‌హించాలనుకున్న ఆయ‌న అందుకు భారీ ఏర్పాట్లే చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఒక వీడియో సాంగ్‌తో రూపొందించిన అత్యంత ఖ‌రీదైన వెడ్డింగ్ కార్డుతో గాలి ఇంటిలో పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. సుమారు 550 కోట్ల రూపాయలు వెచ్చించి ప‌ద‌కొండు రోజులు పాటు ఈ పెళ్లి వేడుక నిర్వ‌హించ‌నున్న‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారం ఇప్పుడు గాలికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది.

ఈ పెళ్లిపై ఇప్ప‌టికే ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు, సీబీఐ అధికారులు కూడా దృష్టి సారించిన‌ట్లు స‌మాచారం. జైలు ఉండి బ‌య‌ట‌కొచ్చిన వ్య‌క్తి ఇన్ని వంద‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టి పెళ్లి చేయ‌డం ఏలా సాధ్య‌ప‌డుంతోంది? పెడుతున్న ఈ ఖ‌ర్చంతా అక్ర‌మ‌మా? స‌క్ర‌మ‌మా? అన్న విష‌యం తేల్చే ప‌నిలో ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు ఉన్నార‌ట‌. ఆదాయ‌ప‌న్ను శాఖ విచార‌ణ‌లో ఈ సొమ్మంతా అక్ర‌మ‌మ‌ని తేలితే మ‌ళ్లీ గాలి జ‌నార్ద‌న్ రెడ్డికి క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని తెలుస్తోంది. ఇక‌, గాలి స‌న్నిహితుడు శ్రీ‌రాములు చెప్పిన మాట వింటే ఎవ‌రికైనా దిమ్మదిర‌గాల్సిందే. త‌మ ఇంటిలో పెళ్లి ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి వ్య‌క్తి కుమార్తె పెళ్లి ఎలా జ‌రుగుతుందో అంతే స్థాయిలో సింపుల్‌గా చేస్తున్నామ‌ని శ్రీ‌రాములు వ్యాఖ్యానించారు. మొత్తానికి శ్రీ‌రాములు మాట ప్రకారం మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఇంటిలో పెళ్లికి 550 కోట్లు ఖ‌ర్చు పెట్టే స్థాయికి భార‌త ప్ర‌జానీకం ఎదిగింద‌న్న‌మాట‌.

Loading...

Leave a Reply

*