2019లో జైలుకు జ‌గ‌న్‌?

jagan

జ‌గ‌న్ మ‌ళ్లీ జైలుకు వెళ‌తాట్ట‌…. దానికి ముహూర్తం కూడా పెట్టారుట‌… అక్ర‌మాస్తుల కేసులో శిక్ష ప‌డి ఆయ‌న క‌ట‌క‌టాలు లెక్కిస్తాట్ట‌… వ‌చ్చే ఎన్నిక‌లు అంటే 2019లో ఇది జ‌ర‌గ‌బోతోందిట‌…ఈ మాట‌లు అంటున్న‌ది ఎవ‌రో కాదు…. ఆయ‌నకు బ‌ద్ధ శ‌త్రువులైన టీడీపీ నేత‌లు… అక్ర‌మాస్తుల కేసుల్లో ఇరుక్కున్న జ‌గ‌న్ పని అయిపోయింద‌ని, ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ‌మూర్తి వ్యాఖ్యానించారు…త‌ల్లి కాంగ్రెస్ ప‌ని అయిపోయింద‌ని, ఇప్పుడు పిల్ల కాంగ్రెస్ వైసీపీ మొస‌లి క‌న్నీరు కారుస్తూ జ‌నాన్ని మ‌భ్య‌పెట్టాల‌ని చూస్తోంద‌ని కేఈ విమ‌ర్శించారు….

అయితే చంద్ర‌బాబును ఎదుర్కోవ‌డం జ‌గ‌న్ వ‌ల్ల కాద‌ని, ఆయ‌న మాట‌లు జ‌నం న‌మ్మ‌ర‌ని కేఈ వ్యాఖ్యానించారు…. ఎట్టి పరిస్థితుల్లోనూ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి జ‌గ‌న్ బ‌య‌ట ఉండ‌డ‌ని ఆయ‌న జైలుకు వెళ్ల‌డం త‌థ్య‌మ‌ని కేఈ బ‌ల్ల‌గుద్ది చెబుతున్నారు… అంటే దీన్నిబ‌ట్టి చూస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ధాటిని ఎట్లాగూ ఎదుర్కోలేము, జ‌గ‌న్ చేతిలో చంద్ర‌బాబుకు ఘోర ప‌రాభ‌వం త‌ప్ప‌దు అని గ్ర‌హించిన టీడీపీ నేత‌లు ఇలా అడ్డ‌గోలు స్కెచ్‌లు వేస్తున్నార‌ని వైఎస్సార్సీ నేత‌లు ఆరోపిస్తున్నారు…

జ‌గ‌న్ గెల‌వ‌కుండా చేయ‌డానికి ఆయ‌న్ని జైల్లో పెట్టించ‌డానికి టీడీపీ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు… అయితే ఇదంతా మైండ్‌గేమ్ అని జ‌గ‌న్ జైలుకు వెళ‌తాడో లేదో ఎవ‌రికి తెలియ‌ద‌ని… వైఎస్సార్సీ నేత‌ల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను కుంగ‌దీసేలా ఇలాంటి మాట‌లు మాట్లాడి వారి స్థైర్యాన్ని దెబ్బ తీయ‌డానికి జ‌రుగుతున్న పొలిటిక‌ల్ సైకాల‌జీ అటాక్‌లో ఇది భాగ‌మ‌ని సీనియ‌ర్ లీడ‌ర్లు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి మైండ్‌గేమ్‌లు ఆడ‌డంలో చంద్ర‌బాబు నిష్ణాతుడ‌ని వాళ్లు చెబుతున్నారు.

Loading...

Leave a Reply

*