హైద‌రాబాద్ తెలంగాణ సొంతం!

hyderabad

ప‌దేళ్ల ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్ ఇప్పుడు తెలంగాణ సొంత‌మైపోతోంది. ఇప్ప‌టికే ఏపీకి చెందిన పాల‌నా యంత్రాంగ‌మంతా విజ‌య‌వాడ‌, గుంటూరుల‌కు త‌ర‌లి పోవ‌డంతో హైద‌రాబాద్‌లోని ఏపీ ప్ర‌భుత్వ కార్యాల‌యాలు బోసి పోతున్నాయి. ఉమ్మ‌డి రాజ‌ధానిలోని ఏపీ స‌చివాల‌యం కూడా ఇప్పుడు మూత‌ప‌డింది. ఒక‌రో ఇద్ద‌రో సిబ్బంది ఉన్నా… అది లెక్క‌లోకి వ‌చ్చే విష‌య‌మేం కాదు. దాంతో క‌దిలిన తెలంగాణ సీఎం కేసీఆర్ నేరుగా గ‌వ‌ర్న‌ర్‌తో స‌మావేశ‌మై ఏపీ స‌చివాల‌యాన్ని త‌మ‌కు అప్ప‌గించాల‌ని ఆయ‌న దృష్టికి తెచ్చారు. ఏపీ ఉద్యోగులు త‌ర‌లి వెళ్లిపోయినందున ఏపీ ప్ర‌భుత్వంతో మాట్లాడి స‌చివాల‌యాన్ని త‌మ‌కు అప్ప‌గించేలా చొర‌వ చూపాల‌ని ఆయ‌న గ‌వ‌ర్న‌ర్‌ను కోరారు. దానికి స‌రేన‌న్న గ‌వ‌ర్న‌ర్ వెంట‌నే ఏపీ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తో ఈ విష‌య‌మై చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు తెలిసింది.

ఆ చ‌ర్చ‌ల‌లో హైద‌రాబాద్‌లోని ఏపీ స‌చివాల‌యాన్ని తెలంగాణకు అప్ప‌గించేందుకు అంగీక‌రించిన సీఎం చంద్ర‌బాబు దానిపై కేబినెట్‌లో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పిన‌ట్లు తెలిసింది. ఈ విష‌యం కేబినెట్‌లో చ‌ర్చించి ఏపీ స‌చివాల‌యాన్ని తెలంగాణ‌కు అప్ప‌గించ‌డానికి ప్ర‌భుత్వం అంగీక‌రిస్తే ఇక హైద‌రాబాద్‌పై పూర్తిగా హ‌క్కులు వ‌దిలేసుకున్న‌ట్లే అవుతుంది. ప‌దేళ్ల ఉమ్మ‌డి రాజ‌ధాని క‌థ‌ రెండున్న‌రేళ్ల‌కే ముగిసిపోతుంది.

Loading...

Leave a Reply

*