దేశంలో ప‌ట్టుబ‌డ్డ న‌ల్ల‌ధ‌నంలో ఆరో వంతు హైద‌రాబాద్‌దే

modi

దేశంలోని న‌ల్ల‌కుబేరుల‌పై ప్ర‌ధాని మోదీ కొర‌డా ఝ‌ళిపించాడు… న‌ల్ల‌డ‌బ్బు క‌క్క‌క‌పోతే క‌ట‌క‌టాలు త‌ప్ప‌వంటూ డెడ్‌లైన్ పెట్టి మ‌రీ హెచ్చ‌రించాడు.. దీంతో బ్లాక్‌మ‌నీ బాక్సులు బ‌ద్ద‌ల‌య్యాయి…. పుట్ట‌లు ప‌గిలి క‌ట్ట‌ల‌పాములు ప్ర‌హ‌హించాయి… జ‌నం తెల్ల‌బోయేలా న‌ల్ల నోట్ల క‌ట్ట‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి.. న‌ల్ల కుబేరులు గ‌డ‌గ‌డ‌లాడుతూ త‌మ బ్లాక్‌మనీని ప్ర‌భుత్వానికి స‌మర్పించుకున్నారు.. ఆదాయ వెల్ల‌డి ప‌థ‌కానికి గ‌డుపు సెప్టెంబ‌ర్ 30తో ముగియ‌డంతో దేశ‌వ్యాప్తంగా 65,250 కోట్ల రూపాయ‌ల న‌ల్ల ధ‌నం వెలుగులోకి వ‌చ్చింది… అయితే ఇందులో ఏకంగా ప‌ది వేల కోట్లు అంటే ఆరో వంతు డ‌బ్బు మ‌న హైదరాబాద్ నుంచే బ‌య‌ట‌ప‌డ‌డం విశేషం… అంటే హైద‌రాబాద్‌లో ఎంత బ్లాక్‌మ‌నీ పేరుకుపోయిందో అర్థం చేసుకోవ‌చ్చు….అంటే దేశంలో 6 రూపాయ‌లు దొరికితే అందులో మ‌న‌ది ఒక రూపాయి అంటే…

బ్లాక్‌మ‌నీకి హైదరాబాద్ ఎంత హ‌బ్‌గా మారిపోయిందో కూడా దీన్నిబ‌ట్టి చెప్ప‌వ‌చ్చు.. ఈమ‌ధ్యే దేశంలో బిలియ‌నీర్స్ జాబితా ప్ర‌క‌టిస్తే అందులో హైద‌రాబాద్ తెలుగువాళ్లు ఏడుగురు ఉన్నారంటే ఇక్క‌డ డ‌బ్బు ఎంత పోగ‌వుతోందో అర్థం చేసుకోవ‌చ్చు… ఢిల్లీ, ముంబై, కోల్‌క‌తా, చెన్నై, బెంగ‌ళూరుల‌ను త‌ల‌ద‌న్ని బ్లాక్‌మ‌నీలో హైద‌రాబాద్ హైరేంజ్‌కు ఎదిగిపోయింది… దేశంలో ఎక్క‌డా లేనంత న‌ల్ల ధ‌నం తెలుగు రాష్ట్రాల్లో పోగ‌వుతోంది…. తెలుగు రాష్ట్రాల‌కు అతి ప్ర‌ధాన న‌గరం.. ఉమ్మ‌డి రాజ‌ధాని అయిన హైద‌రాబాద్ హ‌బ్బుగా న‌ల్ల కుబేరులు చెల‌రేగి పోతున్నారు… మోదీ స‌ర్కార్ జ‌స్ట్ ఒక అల్టిమేటం ఇస్తేనే హైదరాబాద్‌లో 10 వేల కోట్ల న‌ల్ల‌ధ‌నం దొరికిందంటే… ఇక ఐటీ రైడ్స్ జ‌రిగితే ఇక్క‌డ దొరికే బ్లాక్‌మ‌నీ ఎంత ఉంటుందో కూడా ఊహించ‌లేం… ఇప్పుడు దొరికిన 10 వేల కోట్లు కూడా గోరంతే అంటున్నారు… అంటే ఇంకా కొండంత ఉన్న బ్లాక్‌మ‌నీని రాబ‌ట్టాలంటే… న‌ల్ల కొండ‌ల‌ను త‌వ్వాల్సిందే.

Loading...

Leave a Reply

*