రాత్రికి రాత్రి.. హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు 2400 కోట్లు… అంతా ఆ పెద్ద‌ల‌దే…!

untitled-18

మోదీ ప్ర‌భావంతో న‌ల్ల కుబేరులు, అవినీతి అన‌కొండ‌లు అలెర్ట‌య్యారు. ఇటు సామాన్యులు చిల్ల‌ర‌కోసం రోడ్డెక్కి బ్యాంకుల ముందు క్యూ క‌డుతుంటే, అటు బ‌డా బాబులు త‌మ సంపద‌ను వైట్‌గా మార్చుకునే ప‌నిలో బిజీగా ఉన్నారు. ఇన్నాళ్లూ క‌ష్ట‌ప‌డి పోగేసిన గుట్ట‌లు గుట్ట‌ల‌ని ఏం చెయ్యాలో, ఎలా మార్చాలో తెలియ‌క తెగ హైరానా ప‌డుతున్న వారికి ఓ ఐడియా వ‌చ్చింద‌ట‌. విజ‌య‌వాడ‌లో బ్లాక్‌మ‌నీని వైట్‌గా మార్చే అడ్డాలు బోలెడు ఉన్నాయ‌ని, కొంత పర్సంటేజ్ తీసుకుని చేసి పెడుతున్నారు.

మొద‌టి రెండు రోజులు ర‌క‌ర‌కాల మార్గాలు అన్వేషించిన కొంద‌రు బ్లాక్ మ‌నీ బాబులు… ఆ త‌ర్వాత వెంట‌నే విజ‌య‌వాడ ఆఫ‌ర్ భారీగా న‌చ్చింద‌ట‌. వారి ప‌ర్సంటేజ్ కూడా హైద‌రాబాద్‌, పూణే, ముంబ‌యి కంటే వీరిది చాలా త‌క్కువ‌గా ఉంద‌నే టాక్ రావ‌డంతో దాదాపు 10మంది బ‌డా పెద్ద‌లు తమ క‌రెర్సీ బండిల్స్‌ను విజ‌యవాడ‌కు త‌ర‌లించార‌ట‌. ఇందులో టాలీవుడ్ బ‌డా బాబుల‌తోపాటు పొలిటిక‌ల్ నేత‌లు కూడా ఉన్నార‌ని స‌మాచారం.

ముంబై ప‌ర్సంటేజ్ అయితే 40 శాతం అడుగుతున్నారు. ఇది కాస్త ఎక్కువ‌గా అనిపించగా, ఇటు విజ‌య‌వాడ బ్రోక‌ర్లు 15-18 శాతంతో మార్పిడి చేస్తామ‌ని తెలిపార‌ట‌. గుడ్డి కంటే మెల్ల మేల‌న్న‌ట్లు.. ఈ ప‌ర్సంటేజ్‌కే ఒప్పుకొని రాత్రికి రాత్రి సుమారు 2500 కోట్ల రూపాయ‌ల‌ను కంటైన‌ర్‌ల‌లో ఎక్కించి పంపార‌ట‌. దీనిని అంతా మేనేజ్ చేసింది విజ‌య‌వాడ‌కు చెందిన ఓ పొలిటీషియ‌న్ అని స‌మాచారం. మొత్తమ్మీద‌, అవినీతి ప‌రుల‌కు గుండెల్లో గుబులు రేపుతుంద‌ని భావించిన ఈ సంఘ‌ట‌న‌.. వారి అక్ర‌మ‌ సంపాద‌న‌ను వైట్ మ‌నీగా మార్చుకోవడానికి ఉప‌యోగ‌ప‌డుతుండ‌డం విశేషం.

Loading...

Leave a Reply

*