బాబుపై కేసీఆర్ ఎలా గెలిచారు?

kcr

ఎన్నిక‌ల‌లో గెలిచిన నాటి నుంచి ఆయ‌న ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉన్నారు. ముఖ్య‌మంత్రి అయిన రోజు నుంచి క్యాంపు కార్యాల‌యంలోనే ఉంటున్నారు. ఒక్క‌రోజు కూడా విశ్రాంతి లేకుండా క‌ష్ట‌ప‌డుతూనే ఉన్నారు. ఒక్కోజు రోజుకు 20 గంట‌లు కార్యాల‌యంలోనే మ‌కాం వేసి ప‌ని చేసిన రోజులున్నాయి. కుటుంబాన్ని కూడా త్యాగం చేసి క‌ష్ట‌ప‌డుతున్నారు. రాష్ర్టం కోసం దేశ‌దేశాలు తిరుగుతున్నారు. పెట్టుబ‌డులు తెస్తున్నారు. అద్భుత రాజ‌ధాని నిర్మాణం కోసం నిరంత‌రం శ్ర‌మిస్తున్నారు.

ఇక మ‌రొక‌రు…. పెద్ద‌గా శ్ర‌మ‌ప‌డ‌కుండానే పాల‌న సాగిస్తున్నారు. స‌చివాల‌యానికి పెద్ద‌గా రారు. వారాంతాలు… పండుగ రోజుల్లో ఇంటిలోనే ఫాం హౌస్‌లోనో కుటుంబ స‌భ్యుల‌తోనో గ‌డుపుతుంటారు. నిత్యం అధికారుల‌తో స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తూ బిజీ బిజీగా కూడా ఉండ‌రు. త‌న మానాన తాను ఒక ప్ర‌భుత్వ ఉద్యోగి మాదిరి ప‌ని చేసుకుపోతుంటారు.వీళ్లీద్ద‌రిలో ఎవ‌రు నెంబ‌రు వ‌న్ సీఎం అవ్వాలి. అంద‌రి అంచ‌నాల ప్రకారం మొద‌టి వ్య‌క్తే అగ్ర‌స్థానంలో ఉండాలి. అయితే, ఏం జ‌రిగింది. తొలి వ్య‌క్తి నంబ‌రు దిగ‌జారింది. గ‌తంలో ఐదో స్థానంలో ఉన్న సీఎం… నేడు ఏడో స్థానానికి ప‌డిపోయారు. అదే స‌మ‌యంలో రెండో వ్య‌క్తి నెంబ‌రు వ‌న్ అయ్యారు.

పెద్ద‌గా శ్ర‌మ‌ప‌డ‌కున్నా దేశంలోని ముఖ్య‌మంత్రుల‌లో తొలి బెస్ట్ సీఎంగా నిలిచారు. ఆయ‌నే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ఐదు నుంచి ఏడో స్థానానికి దిగ‌జారిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. పాల‌న‌ను ప‌రుగులు పెట్టిస్తున్న చంద్ర‌బాబు ఎందుకు వెన‌క‌ప‌డ్డార‌న్న‌ది ఇప్పుడు టీడీపీ నేత‌ల‌ను తొలుస్తున్న ప్ర‌శ్న‌. రాజ‌కీయ వ్యూహాల‌తో తాను బ‌లోపేత‌మై…. విప‌క్షాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ… సైలెంట్‌గా ప‌నిచేస్తున్న కేసీఆర్ ఉత్త‌మ ముఖ్య‌మంత్రిగా నిలిచారు. ఇది టీడీపీ నేత‌ల‌కు మింగుడు ప‌డ‌డం లేదు. అయితే, ఏపీలో చంద్ర‌బాబు ఎంత క‌ష్ట‌ప‌డుతున్నా… ఆ క‌ష్టాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో విఫ‌ల‌మ‌వ్వ‌డం వల్ల‌నే జనాభిప్రాయం వేరుగా ఉంద‌ని అధికార పార్టీలోని ఒక వ‌ర్గం చెబుతోంది. ఇదీ నిజ‌మే కావ‌చ్చు. తెలంగాణ‌లో కేసీఆర్ త‌న‌కు రాజ‌కీయంగా ఎదురు లేకుండా చేసుకున్నారు.

ఏపీలో చంద్ర‌బాబు తాను చేస్తున్న ప‌నిని కూడా జ‌నంలోకి స‌క్ర‌మంగా తీసుకెళ్ల‌లేక‌పోయారు. పైగా ప్ర‌తిప‌క్షాలంతా ఒక్క‌టై ప్ర‌భుత్వంతో పోరాడే అవ‌కాశం ఇచ్చారు. రాష్ట్రంలో పెద్ద‌గా పట్టులేని బీజేపీని ప‌ట్టుకుని ఊగుతూ(కేంద్రంలో అవ‌స‌రం కాబట్టి త‌ప్ప‌డం లేద‌నుకోండి)… రాష్ట్రంలో కీల‌కంగా ఉన్న క‌మ్యూనిస్టుల‌ను శ‌త్రువుల‌ను చేసుకున్నారు. వారి పోరాటాలపై క‌ఠినంగా ఉంటూ మ‌రింత న‌ష్టం చేసుకున్నారు. నిన్న‌టి వ‌ర‌కూ ఉన్న ప‌వ‌న్‌ను కూడా శ‌త్రువుగా చేసుకున్నారు. ఇక‌, బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం ఎలాగూ ఉంది. క‌నీసం దానిని కూడా చంద్ర‌బాబు బ‌ల‌హీనం చేయ‌లేక‌పోయారు. వెర‌సి రాష్ట్రంలో చంద్ర‌బాబుకు రాజ‌కీయంగా ప్ర‌త్య‌ర్థులు ఎక్కువ‌య్యారు. దాంతో ఆయ‌న 24 గంట‌లూ క‌ష్ట‌ప‌డినా జ‌నానికి మాత్రం రెండో అభిప్రాయం క‌లుగుతోంది.

Loading...

Leave a Reply

*