భార‌త్ జవాన్‌లు ఉగ్ర‌వాదుల‌ను ఇలా ఖ‌తం చేశారు…!

bharat

ఉగ్ర‌వాదుల ఏరివేతే ల‌క్ష్యంగా భార‌త ఆర్మీ బుధ‌వారం రాత్రి ప‌న్నెండున్న‌ర‌కు దాడులు మొద‌లెట్టింది. పీవోకేలోకి మూడు కిలోమీట‌ర్ల చొచ్చుకెళ్లి తెల్లవారుజామున‌ 4.30 గంటల వరకు దాడులు కొన‌సాగించింది. రష్యన్ తయారీ ఎంఐ 17హెలికాప్టర్‌లో కెల్, లింపా, బిన్బర్ గుండా భారతీయ కమాండోలు వెళ్ళారు. శ‌త్రు మూక‌లకు ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా మెరుపు వేగంతో గంటకు 250 కి.మీ. స్పీడుతో ఉగ్ర‌వాద శిబిరాల‌పైకి దండెత్తిన‌ట్లు తెలిసింది.

భార‌త బ‌ల‌గాలు చేప‌ట్టిన ఆప‌రేష‌న్‌ను ర‌క్ష‌ణ మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్‌, అజిత్ దోవల్ త‌దిత‌రులు ఆర్మీ హెడ్ క్వార్ట‌ర్‌లోనే ఉండి రాత్రంతా సైనిక చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షించిన‌ట్లు స‌మాచారం. దాడులు చేసిన విష‌యాన్ని ఆర్మీ గురువారం ఉద‌యం రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తిల‌కు తెలియ‌జేసింది. దాడులు చేసిన విష‌యాన్ని పాకిస్థాన్‌కు కూడా వెల్ల‌డించిన‌ట్లు ఆర్మీ అధికార ప్ర‌తినిధి తెలిపారు.

 

Loading...

Leave a Reply

*