అమెరికా ఎన్నిక‌ల‌లో వ‌చ్చిన తొలిఫ‌లితం… హిల్ల‌రీదే గెలుపు..!

untitled-13

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌లో హోరా హోరీ ఫైట్ త‌ప్ప‌ద‌నే అంచ‌నాలున్నాయి. మొద‌ట హిల్ల‌రీయే గెలుస్తుంద‌ని భావించినా, ఆ త‌ర్వాత ఈ మెయిల్స్ వ్య‌వ‌హారంతో ఆమె ఓట‌మి త‌ప్ప‌ద‌నే ఎక్స్‌పెక్టేష‌న్స్ వెలువ‌డ్డాయి. కానీ, అమెరికా ఎన్నిక‌ల‌లో వెలువ‌డిన తొలి ఫ‌లితం హిల్ల‌రీకే అనుకూలంగా ఉంది.

న్యూ హాంప్‌షైర్‌లోని డిగ్జ్‌విల్లే నాచ్ ఫ‌లితంలో ఎనిమిది ఓట్ల‌లో హిల్ల‌రీకి నాలుగా ఓట్లు ప‌డ‌గా, ఆమె ప్ర‌త్య‌ర్ధి డొనాల్డ్ ట్రంప్‌కు 2 ఓట్లు ప‌డ్డాయి. ఇక‌, స్వ‌తంత్రులు గేరీ జాన్స‌న్‌, మిట్టీ రోమ్నీ చెరొక ఓటు పొందారు. కెనడా సరిహద్దు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వూరిలో 24 గంటల ముందుగానే తొలి ఫలితం వెలువడుతుంది. ఎందుకంటే ఇక్కడ అర్థరాత్రి పోలింగ్‌ మొదలవుతుంది. అధ్యక్ష ఎన్నికల్లో ఇక్కడే పోలింగ్‌ ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తోంది. అమెరికాలో 12 గంటల పాటు పోలింగ్‌ జరిగిన తర్వాత ఒక్కో రాష్ట్రంలో పోలింగ్‌ కేంద్రాలను మూసేస్తారు. ఆ వెంటనే కౌంటింగ్‌ మొదలవుతుంది. టైమ్‌ జోన్లు వేర్వేరుగా ఉండడం వల్ల ఒక చోట ఫలితాలు వెలువడుతున్న సమయానికి మరో రాష్ట్రంలో పోలింగ్‌ కొనసాగుతూనే ఉంటుంది.

అయితే, డిక్స్‌వెల్లే పోలింగ్‌పై ఓ సెంటిమెంట్ ఉంది. ఇక్క‌డ గెలిచిన వారే అమెరికా ప్రెసిడెంట్ అవుతార‌ని అమెరిక‌న్‌ల న‌మ్మ‌కం. మ‌రి ఇదే నిజ‌మ‌వుతుందా? లేదా? అనేది చూడాలి. మ‌రోవైపు, న్యూ హాంప్‌షైర్‌లో ట‌ఫ్ ఫైట్ న‌డుస్తోంది.

 

Loading...

Leave a Reply

*