ట్రంప్‌కి చుక్క‌లు చూపించిన హిల్ల‌రీ..!

trump-and-hillary

నోటిదురుసుతో అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌లో దూసుకుపోతున్న ట్రంప్‌కు ఆయ‌న ప్ర‌త్య‌ర్థి హిల్ల‌రీ క్లింట‌న్ కౌంట‌ర్ ఇచ్చారు. హిల్ల‌రీపై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌తో ట్రంప్ చెల‌రేగిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే హిల్ల‌రీ, ట్రంప్ మ‌ధ్య తొలిసారి ప్ర‌త్య‌క్షంగా హోరా హోరీ చ‌ర్చ జ‌రిగింది. ఆ చ‌ర్చ‌లో ట్రంప్‌కు హిల్ల‌రీ కౌంట‌ర్ ఇచ్చారు.ట్రంప్ నిలువెల్లా జాత్యాహంకార‌మేన‌ని, దానితోనే ఆయ‌న రాజ‌కీయ జీవితం మొద‌లైంద‌ని హిల్ల‌రీ మండిప‌డ్డారు. కార్పొరేట్ లొసుగుల‌ను ఆధారం చేసుకుని ట్రంప్ కుటుంబం భారీగా ల‌బ్ధి పొందింద‌ని తాను అధికారంలోకి వ‌స్తే సంప‌న్నుల‌కు ఇస్తున్న ప‌న్ను రాయితీల‌ను తొల‌గిస్తామ‌ని, కార్పొరేట్ లోసుగుల‌కు చెక్ పెడ‌తామ‌ని హిల్ల‌రీ చెప్పారు.

దేశానికి దేశ భ‌ద్ర‌త‌కు పెను స‌వాలుగా నిలిచిన హ్యాకింగ్‌ను కంట్రోల్ చేయ‌డం ట్రంప్ వ‌ల్ల సాధ్యం కాద‌ని, క‌మాండ‌ర్ ఇన్ చీఫ్‌గా ట్రంప్ ప‌నికిరార‌ని ఆయ‌న చెబుతున్న విధానాలు హ్యాకింగ్‌ను ఎదుర్కోలేవ‌ని హిల్ల‌రీ ధ్వ‌జ‌మెత్తారు. ఇక‌, హిల్ల‌రీకి ట్రంప్ కూడా ధీటుగానే బ‌దులిచ్చారు. త‌న‌కు ఈ డిబెట్ పెద్ద ముఖ్యం కాద‌ని, అధ్య‌క్ష ఎన్నికే త‌న దృష్టిలో చాలా కీల‌క‌మైంద‌ని ట్రంప్ అన్నారు. ఐఎస్ అనే ఉగ్ర‌వాద సంస్థ ఎదుగుల‌కు ఒబామా, హిల్ల‌రీ పార్టీయే కార‌ణ‌మ‌ని తాను ఎలాంటి జాత్యాహంకారం చూపించ‌లేద‌ని ట్రంప్ అన్నారు. ఈ తొలి డిబేట్‌లో హిల్ల‌రీ ట్రంప్ కంటే 40 శాతం ఎక్కువ ఓట్లు గెలుచుకోవడం విశేషం. హిల్ల‌రీ క్లింట‌న్ డిబేట్ బావుంద‌ని 63 శాతం ఆమెకి ఓటేస్తే.. 27 శాతం మాత్రమే ట్రంప్‌కి మ‌ద్దతు ప‌లికారు. ఇలా, తొలి డిబేట్‌లోనే ట్రంప్‌కి చుక్క‌లు చూపించింది హిల్ల‌రీ క్లింట‌న్‌.

Loading...

Leave a Reply

*