టీ స‌ర్కారుకు హైకోర్టు రెడ్ సిగ్న‌ల్‌!

telangana

తెలంగాణ ప్ర‌భుత్వానికి మ‌రో ఎదురు దెబ్బ త‌గిలింది. రాష్ట్ర స‌చివాల‌యాన్ని కూల‌గొట్టి కొత్త‌గా క‌ట్టాల‌నుకుంటున్న ప్ర‌భుత్వ య‌త్నానికి తాత్కాలిక బ్రేక్ ప‌డింది. ఎంత తొంద‌ర‌గా వీలైతే అంత తొంద‌ర‌గా కొత్త స‌చివాల‌యాన్ని నిర్మించాల‌ని కేసీఆర్ త‌ల‌పోస్తున్నారు. ఇందుక‌నుగుణంగానే వేగ‌వంతంగా చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. అయితే, ప్ర‌భుత్వం ఉన్న‌వాటిని కూల్చి కొత్త‌వి క‌డ‌తానంటూ దుబారా ఖ‌ర్చుల‌కు తెర‌తీస్తోంద‌ని ఆరోపిస్తున్న విప‌క్షాలు స‌చివాల‌య నిర్మాణంపై కూడా అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్నాయి.

విద్యార్థుల‌కు ఫీజులు చెల్లించ‌కుండా వారిని ఇబ్బంది పెడుతున్న ప్ర‌భుత్వం స‌చివాల‌యం నిర్మాణం పేరిట వంద‌ల కోట్లు ఖ‌ర్చు పెట్ట‌డం ఎందుక‌ని విప‌క్ష నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. రైతు రుణ‌మాఫి, ఫీజు రీయింబ‌ర్సమెంట్ వంటి అత్య‌వ‌స‌ర‌మైన వాటికి నిధులు ఇవ్వ‌కుండా ఉన్న స‌చివాల‌యాన్ని కూల్చి కొత్త‌ది క‌డ‌తానంటూ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌డం స‌రైంది కాద‌న్న‌ది వారి అభిప్రాయం. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ నేతలు జీవ‌న్ రెడ్డి, కోమ‌టిరెడ్డిలు స‌చివాల‌య నిర్మాణంపై హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఆ పిటిష‌న్‌ను విచారించిన ధ‌ర్మాస‌నం ప‌ది రోజుల పాలు స‌చివాల‌య కూల్చివేత‌ల‌ను నిలిపివేయాలంటూ మ‌ధ్యంత‌ర ఆదేశాలిచ్చింది. అప్ప‌టి లోపు కౌంట‌ర్ వేయాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశిస్తూ.. విచార‌ణ‌ను వాయిదా వేసింది.

Loading...

Leave a Reply

*