కేసీఆర్‌కు ఆ అధికారం లేదు!

k-chandrashekar-rao

కొత్త జిల్లాల ఏర్పాటుకు అడ్డంకులు మొద‌ల‌య్యాయి. అడిగిన వారికి అడిగిన‌ట్లు జిల్లాలు ఇస్తున్నా నిర‌స‌న‌లు త‌ప్ప‌డం లేదు. కొత్త జిల్లాల డిమాండ్ల‌ను సీఎం కేసీఆర్ సాధ్య‌మైనంత వ‌ర‌కూ ప‌రిష్క‌రించేందుకే ప్ర‌య‌త్నించారు. దాంతో 17 జిల్లాలు పెంచాల‌నుకుంటే అది 21కి చేరింది. ఇప్పుడు మ‌రికొన్ని ముందుకొస్తున్నాయి. రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల‌లో ఆందోళ‌న‌లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పుడు కోర్టుల‌కు ఎక్క‌డం కూడా మొద‌లైంది. ఎలాగైనా స‌రే ద‌స‌రా నాడు కొత్త జిల్లాలు ఏర్పాటు త‌థ్య‌మ‌ని సీఎం ప్ర‌క‌టించారు. ఇందుకోసం కార్యాచ‌ర‌ణ వేగంగా జ‌రుగుతోంది. ఉద్యోగుల‌కు పండుగ నాడు సెల‌వులు కూడా ర‌ద్దు చేశారు. అయితే, మ‌రోవైపు తెలంగాణ‌లోని ఏజెన్సీ ప్రాంతాల‌ను వేరు చేస్తే కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేయ‌డాన్ని వ్య‌తిరేకిస్తూ హైకోర్టులో వేర్వేరు పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి. షెడ్యూల్డ్ ప్రాంతాల‌ను ఇష్ట‌మొచ్చిన‌ట్లు వేరు చేసి కొత్త జిల్లాల‌లో క‌ల‌పే అధికారం రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేదంటూ పిటిష‌న‌ర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు. రాజ్యాంగంలోని ఐద‌వ షెడ్యూల్‌లోని నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా గిరిజ‌న ప్రాంతాల‌ను మైదాన ప్రాంతాల‌కు క‌లుపుతున్నార‌ని ఆక్షేపించారు. కొత్త జిల్లాల నోటిఫికేష‌న్ నిలుపుద‌ల‌కు ఆదేశాలివ్వాల‌ని వారు కోరారు.  కాగా, దీనిపై విచార‌ణ ద‌స‌ర సెల‌వుల త‌ర్వాత చేప‌డ‌తామ‌ని ధ‌ర్మాస‌నం తెలిపింది.

Loading...

Leave a Reply

*