బాబుపైకి హ‌రీశ్‌… స‌ర్దిచెప్పిన కేసీఆర్‌!

harish-and-babu

ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ హ‌స్తిన‌లో కూల్‌గా జ‌రిగిపోయింది. ఊహించ‌ని ప‌రిణామాలేవీ జ‌ర‌గ‌లేదు. పెద్ద‌పెద్ద స‌మ‌స్య‌లేవీ ప‌రిష్కారం కాలేదు. సుప్రీంకోర్టు చెప్పిన మేర‌కు స‌మావేశం ఏర్ప‌టు చేశామ‌న్న ఉమాభార‌తి మీలో మీరే ఎప్ప‌టిక‌ప్పుడు మాట్లాడుకుంటే స‌మ‌స్య‌లే ఉండ‌వు క‌దా అని పాత సంగ‌తే చెప్పారు. అయితే, స‌మావేశంలో చోటు చేసుకున్న ఒక ప‌రిణామ‌మే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. చంద్ర‌బాబు మాట్లాడుతుండ‌గా జోక్యం చేసుకున్న తెలంగాణ మంత్రి హ‌రీశ్‌రావు ఏపీ వైఖ‌రిపై విరుచుకుప‌డ్డార‌ట‌. స్నేహంగా ఉంటామంటూనే పుల్ల‌లు పెడుతున్నారంటూ ధ్వ‌జ‌మెత్తార‌ట‌. ఓ వైపు స్నేహ‌మంటూనే మ‌రోవైపు తాము క‌ట్టుకుంటున్న ప్రాజెక్టుల‌కు అడ్డుపుల్ల‌లు పెడుతున్నారంటూ ఆవేశ‌ప‌డ్డార‌ట‌.

పులిచింత‌ల ముంపున‌కు గుర‌వుతుంటే త‌మ రాష్ట్రంలోని గ్రామాల‌ను ఖాళీ చేయించామ‌ని, ఆంధ్ర‌లో పంట‌లు ఎండిపోతుంటే సాగ‌ర్ నుంచి నీళ్లు వ‌దిలామ‌ని ఇలా తాము ఏపీకి ఎన్నోచేస్తుంటే ఆ రాష్ట్రం మాత్రం త‌మ‌కు అడుగ‌డుగునా అడ్డుప‌డుతుంద‌ని వ్యాఖ్యానించార‌ట‌. ఈ క్ర‌మంలోనే జోక్యం చేసుకున్న కేసీఆర్ హ‌రీశ్‌ని కూల్ చేసే ప్ర‌య‌త్నం చేశార‌ని తెలిసింది. అటూ ఇటూ చంద్ర‌బాబు, చంద్ర‌శేఖ‌ర‌రావుల‌ను కూర్చోబెట్టుకుని మ‌ధ్య‌లో తాను కూర్చున్న ఉమాభార‌తి పెద్ద‌క్క‌గా చ‌ర్చ‌లు సాగిస్తుంటే మ‌ధ్య‌లో హ‌రీశ్ జోక్యం చేసుకుని ఆవేశ‌పూరితంగా మాట్లాడ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

Loading...

Leave a Reply

*