ఓట్ల కోస‌మే ఎమ్మెల్యేల‌ను పిలిచామ‌న్న బాబు

babu1

టీడీపీ ఎమ్మెల్యేల‌కు, ఇంచార్జీల‌కు ప్రారంభించిన ప్ర‌త్యేక శిక్ష‌ణ‌ను చంద్ర‌బాబు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన ప‌లు వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. పార్టీ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నేతలంద‌రినీ శిక్ష‌ణా శిబిరాల‌కు పిల‌వాల‌నుకున్నా ఎమ్మెల్యేల‌నే పిల‌వ‌డం వెనుక ఒక కార‌ణం ఉంద‌ని చంద్ర‌బాబు చెప్పారు. ఎమ్మెల్యేలు, రాజ్య‌స‌భ స‌భ్యుల‌తో పెద్ద‌గా ఉప‌యోగం లేద‌ని ఆయ‌న ప‌రోక్షంగా వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌ల్లోకి వెళ్లి ఓట్లు వేయించుకొచ్చేది ఎమ్మెల్యేలు, లోక్‌స‌భ స‌భ్యులేన‌ని అందుకే వారికే ఈ శిక్ష‌ణా కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశామ‌ని చెప్పారు.

ప్ర‌స్తుత ఎమ్మెల్యేల్లో చాలామందికి ప్ర‌జ‌ల్లో మంచి పేరుంద‌ని, అయితే, ప‌నులు చేయ‌డంలో వెనుక‌బ‌డుతున్నార‌ని, అలాగే కొందరికి ప‌నులు చేయించుకోవ‌డంలో ముందున్నార‌ని అయితే, వివిధ కార‌ణాల‌తో వారిపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేకత ఏర్ప‌డింద‌ని ఈ తేడాను స‌రి చేయాల్సి ఉంద‌ని చంద్ర‌బాబు చెప్పారు. అందుకే మ‌రో రెండున్న‌రేళ్ల‌లో ఎన్నిక‌లు రానున్న నేప‌థ్యంలో ఇప్ప‌టి నుంచే ప్ర‌జా మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టేందుకు ఎమ్మెల్యేలు సిద్ధం కావాల్సి ఉంద‌న్నారు. ఇందుకోసం కొత్త సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప‌ని చేయాల‌ని చెప్పారు.

Loading...

Leave a Reply

*