నోట్ల మార్పిడిపై కేంద్రం శుభ‌వార్త‌.. పండ‌గ చేసుకోవ‌చ్చు…!

untitled-5-copy

పెద్ద నోట్ల ర‌ద్దుతో మోదీ స‌ర్కార్ సంచ‌ల‌నం సృష్టిస్తోంది. పూట‌కో ప్ర‌క‌ట‌న‌తో సామాన్యుల గుండెల్లో ద‌డ పుట్టిస్తోంది. అయితే, తాజాగా నోట్ల ర‌ద్దు అంశంపై మాత్రం సామాన్యుల‌కు శుభ‌వార్త వినిపించింది. పాత నోట్ల మార్పిడికి ఈ ఏడాది డిసెంబ‌ర్ 30వ‌ర‌కు మొద‌ట డెడ్‌లైన్ ప్ర‌క‌టించింది కేంద్ర ప్ర‌భుత్వం. దానిని పొడిగించే అవకాశం ఉన్న‌ట్లు ఉన్న‌తాధికారులు చెబుతున్నారు.

కొత్త‌నోట్ల‌న్నీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాతే పాత నోట్ల మార్పిడిపై ఓ నిర్ణ‌యానికి రావాల‌ని కేంద్రం భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతానికి డిసెంబ‌ర్ నెలాఖ‌వ‌ర‌కే నోట్ల మార్పిడికి అవ‌కాశం ఉంటుంద‌ట‌. అయితే, అప్ప‌టికీ మార్కెట్‌లో పాత నోట్లు బాగా ఉన్నాయ‌ని తెలిస్తే.. ఆ గడువును మ‌రింత పెంచే అవ‌కాశం ఉంద‌ని లీక్‌లు వ‌స్తున్నాయి.

నోట్ల మార్పిడిపై వ‌స్తున్న అవాస్త‌వ ప్ర‌చారాల‌ను కేంద్రం కొట్టిపారేస్తోంది. త్వ‌రలోనే దీనిని ర‌ద్దు చేస్తార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. దీనిపై స్పందించిన కేంద్ర ఉన్న‌తాధికారులు అవ‌న్నీ రూమ‌ర్‌ల‌నీ తేల్చిపారేశారు. నోట్ల మార్పిడిపై ఇంత‌వ‌ర‌కు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని, ఇలాంటి వ‌దంతుల‌ను ప్ర‌జ‌లు న‌మ్మొద్ద‌ని తెలిపింది. మొత్తానికి ఇది ఓ గుడ్ న్యూస్. ఏమంటారు..?

Loading...

Leave a Reply

*