ఆ వ్య‌వ‌హారం గాలికి ముందే తెలుసు.. అందుకే భ‌లే త‌ప్పుకున్నాడు..!

untitled-6

ఒక‌వైపు జ‌న‌మంతా వంద నోటు కోసం బ్యాంకు ఎదుట క్యూలో నిల‌బ‌డ్డారు. మ‌రోవైపు బుధ‌వారం అంగ‌రంగ వైభ‌వంగా వంద‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టి గాలి జనార్ద‌న్ రెడ్డి త‌న కుమార్తె ప‌ళ్లి చేస్తున్నారు. నోట్లు చెల్లక జ‌న‌మంతా ఇక్క‌ట్లు ఎదుర్కొంటుంటే… గాలి ఇంత ఖ‌ర్చు ఎలా చేస్తున్నారు? ఆయ‌న‌కు అంత‌పెద్ద‌మొత్తంలో చిన్న నోట్లు ఎక్క‌డివి? అన్న అనుమానాలు దేశ ప్ర‌జ‌ల‌లో క‌లుగుతున్నాయి. ఈ అనుమానాల‌కు స‌మాధానంగా సంచ‌ల‌నాత్మ‌క విష‌యం ఒక‌టి బ‌య‌ట‌ప‌డింది. నోట్ల ర‌ద్దుపై నాలుగో కంటికి తెలియ‌ద‌ని మోడీ, బీజేపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

అయితే, ఐదో క‌న్ను అయిన గాలికి ముందే ఈ విష‌యం లీకైందా అన్న అనుమానాలు ఇప్పుడు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే గాలి త‌న కుమార్తె పెళ్లికి ఏర్పాట్ల‌ను ఆరు నెల‌ల ముందే మొద‌లు పెట్టారు. ఈ రోజు జ‌రుగుతున్న పెళ్లికి చేసి ఖ‌ర్చుల‌న్నింటికి ఆయ‌న ఆరు నెల‌ల ముందే పూర్తి చెల్లింపులు చేసేశార‌ట‌. పెళ్లి ఏర్పాట్ల కోసం గాలి ఆరు నెల‌ల ముందే ఎందుకు చెల్లింపులు చేశార‌న్న‌దే ఇక్క‌డ కీల‌కాశం. ఒకప్పుడు బీజేపీ నేత‌గా, మంత్రిగా వెలిపోయిన గాలికి బీజేపీ అధిష్టానంలోని కొంద‌రితో స‌న్నిహిత సంబంధాలే ఉన్నాయి.

ఈ స‌న్నిహిత సంబంధాలే మోడీ తీసుకోబోతున్న నిర్ణ‌యాన్ని గాలికి ముందే చేర‌వేశాయా? అన్న ప్ర‌శ్న ఇప్పుడు అంద‌రిలోనూ క‌లుగుతోంది. కొస‌మెరుపు ఏమిటంటే…. నోట్ల ర‌ద్దు ప్ర‌ణాళిక ఆరు నెల‌ల ముందే త‌యారు చేశామ‌ని అప్ప‌టి నుంచే అత్యంత ర‌హ‌స్యంగా మోడీ త‌న కార్యాచ‌ర‌ణ మొద‌లు పెట్టామ‌ని బీజేపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అనూహ్యంగా ఆరు నెల‌ల ముందే గాలి కూడా త‌న కుమార్తె పెళ్లికి చెల్లింపులు చేసేశారు.

Loading...

Leave a Reply

*