గాలి గారి వైభోగం ఇక హైద‌రాబాద్‌కి మారుతోంద‌ట..!

gali

దేశ‌మంతా ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా… ప్ర‌జ‌లంతా ఏమ‌నుకున్నా… ఏకంగా పార్ల‌మెంట్లోనే త‌న ఇంటి వేడుక ఒక ఇష్యూగా మారినా డోంట్ కేర్ అన్నాడు గాలి జ‌నార్ద‌న్ రెడ్డి. తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్లు చేసి చూపించాడు. త‌న కుమార్తె పెళ్లిని ప‌ది కాలాల పాటు గుర్తుంచుకునేలా చేయాల‌న్న గాలి అందులో ఏ లోటు రాకుండా చూసుకున్నాడు. దేశంలో పెద్ద నోట్ల‌ను మోడీ ర‌ద్దు చేసి పారేసినా… వంద నోటు కోసం జ‌న‌మంతా ఎగ‌బ‌డుతున్న వంద‌ల కోట్లు పెట్టి మ‌రీ గాలి త‌న ఇంటిలో పెళ్లి వేడుక‌ను ముగించారు.

పెళ్లి వచ్చిన వారంతా గాలివారి వైభోగం చూసి అచ్చెరువొందారు. ఔరా ఏమీ ఈ సెట్టింగులు… ఏమి ఈ విందు వినోదాలు అంటూ క‌ళ్లారా…. క‌డుపారా అనుభ‌వించారు. బ్రేవ్‌మ‌ని త్రేన్పుతూ గాలిని పొగిడి…. ఆయ‌న కుమార్తెను ఆశీర్వ‌దించి వెళ్లారు. బెంగ‌ళూరులో వేడుకను ఇలా ముగించిన గాలి ఇప్పుడు హైద‌రాబాద్‌లో మ‌రో వేడుక‌కు సిద్ధ‌మ‌య్యారు. గాలి త‌న కుమార్తెను హైద‌రాబాద్‌కు చెందిన కుటుంబంలోకే కొడ‌లిగా పంపిన సంగ‌తి తెలిసిందే. అలాగే, ఏపీలోని త‌న బంధు మిత్రుల కోసం భారీ రిసెప్ష‌న్ ఏర్పాటు చేయాల‌ని గాలి నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. ఈ నెల 20న ఈ వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని గాలి ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిసింది.

Loading...

Leave a Reply

*