గాలి గారి కూతురి పెళ్లి విందుభోజనం ఖ‌ర్చెంతో తెలుసా…?

gali-janardhan

గాలి గారి ఇంట‌ పెళ్లి సంద‌డికి స‌ర్వం సిద్ధం అవుతోంది. హైదరాబాద్‌కి చెందిన ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త కుమారుడు రాజీవ్ రెడ్డికి గాలి జ‌నార్ద‌న రెడ్డి త‌న కూతురిని ఇచ్చి వివాహం చేస్తున్నారు. ఈ మ్యారేజ్‌కి ఇప్ప‌టికే పెళ్లి పిలుపులు కూడా దాదాపు అయిపోయాయి. గాలి జ‌నార్ధ‌నే రెడ్డి స్వ‌యంగా తెలుగు రాష్ట్రాల‌తోపాటు క‌ర్నాట‌క‌లోని వీవీఐపీల‌కు స్వయంగా ఆహ్వానాలు ఇచ్చారు. కూతురు పెళ్లికి హాజ‌రై వ‌చ్చారు. కార్డ్‌తోనే సంచ‌ల‌నం సృష్టించిన ఈ మ్యారేజ్ కోసం గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి సుమారు 250 కోట్లు ఖ‌ర్చు పెడుతున్న‌ట్లు వార్తలు వ‌స్తున్నాయి.

కూతురు పెళ్లికి వ‌డ్డించే విందు భోజనం కోసం గాలి జ‌నార్ద‌న్ రెడ్డి భారీ ఏర్పాట్లు చేస్తున్నాడ‌ట‌. సుమారు 25వేల మంది వంట‌గాళ్ల‌ని ఆయ‌న రెడీగా ఉంచార‌ట‌. దాదాపు 2నుంచి రెండున్న‌ల‌ర ల‌క్ష‌ల మందికి విందు ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారట‌. బ‌ళ్లారితోపాటు ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోని చాలా మంది ఈ మ్యారేజ్‌కి వ‌స్తార‌ని అంచ‌నా వేస్తున్నారు. అందుకే,ఈ రేంజ్‌లో స‌ర్వం సిద్ధం చేస్తున్నారు.

మెనూ కింద దాదాపు అన్ని ర‌కాల వంట‌కాల‌ను వ‌డ్డించ‌నున్నార‌ట‌. వెజ్‌, నాజ్ వెజ్‌తోపాటు బార్బిక్యూ, తందూరి, చైనీస్ ఐటెమ్స్ కూడా రెడీ చేస్తున్నార‌ట‌. మొత్తం నాలుగు సెక్ష‌న్‌లుగా విభజించి.. వీవీఐపీలు, వీఐపీలు, ప్రెస్ మీడియా, బంధువులు, స‌న్నిహితులను మూడు కేట‌గిరిలుగా విభ‌జించార‌ని స‌మాచారం. ఆ త‌ర్వాత నాలుగో సెక్ష‌న్‌లో సామాన్య ప్ర‌జలు, ఆయ‌న నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు విందును స్పెష‌ల్‌గా ఏర్పాటు చేస్తున్నార‌ట‌. దీనికోసం దాదాపు 100 కోట్లు వెచ్చించనున్నార‌ని తెలుస్తోంది. మొత్త‌మ్మీద‌, విందుభోజనం సువాస‌న‌లు క‌నీసం ప‌ది ఊర్ల‌కు త‌గిలేలా ఏర్పాట్లు చేస్తున్నార‌ట గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి. ఎంత‌యినా అప్ప‌నంగా వచ్చిప‌డిన మైనింగ్ మాఫియా మ‌నీ క‌దా..! ఇలానే ఉంటుంది మ‌రి.

Loading...

Leave a Reply

*