గాలి కూతురి పెళ్లిలో ఊహించ‌ని ట్విస్ట్‌!

gali-janardhan

గాలి జ‌నార్ద‌న్ రెడ్డి. మైనింగ్ సామ్రాజ్యాన్ని గ‌డ‌గ‌డ‌లాడించి కోట్ల‌కు అధిప‌తి అయిన ఈయ‌న మ‌రోసారి హాట్ టాపిక్‌గా వార్త‌ల్లోకి వ‌చ్చారు. అప్ప‌ట్లో అవినీతి అక్ర‌మాల‌తో జైలు పాలై కొన్నాళ్లు వార్త‌ల్లో ఉన్న జ‌నార్ద‌న్ రెడ్డి ఇప్పుడు…. త‌న కుమార్తె పెళ్లి విష‌య‌మై అంద‌రి నోళ్ల‌లో నానుతున్నారు. జైలుకు వెళ్ల‌క ముందు బంగారు కంచాల‌లో తింటూ రాజ‌భోగం వెల‌గ‌బెట్టిన ఈ బ‌ళ్లారి బాబు… ఇప్పుడు తన కుమార్తె పెళ్లి నాలుగు త‌రాలు క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకునే రేంజ్‌లో చేస్తున్నారు. గాలి కుమార్తె పెళ్లి కార్డుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అంద‌రికీ ప్ర‌త్యేక ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. పెళ్లి కార్డును ఒక బాక్స్‌లో అమ‌ర్చి అత్యంత సుంద‌రంగా దాన్ని తీర్చి దిద్దారు. మాయాబ‌జార్ సినిమాలో మాదిరి ఆ పెళ్లి కార్డు పెట్టెను ఓపెన్ చేయ‌గానే అందులో గాలి కుటుంబం ఉన్న వీడియో ప్లే అవ్వ‌డం మొద‌ల‌వుతుంది.

స‌కుటుంబ స‌మేతంగా పెళ్లికి రావాల్సిందిగా కోరుతూ జ‌నార్ద‌న్ రెడ్డి కుటుంబం ప‌లికే ఆహ్వాన‌వ‌చ‌నాలు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాయి. అందులో జ‌నార్ద‌న్ రెడ్డి కుమార్తె బ్ర‌హ్మ‌ణి…. ఆమెను మ‌నువాడ‌బోయే రాజీవ్ రెడ్డిల పేర్ల‌తో ప్లేబ్యాక్ సాంగ్‌తో అత్యంత ఆక‌ర్ణ‌ణీయంగా ఈ వీడియో ప్లే అవుతుంది. నిశ్చితార్థం రోజునే వ‌జ్ర వైడూర్యాలు పొదిగిన న‌గా న‌ట్ర ముందు పెట్టుకుని జ‌నార్ద‌న్ రెడ్డి కుటుంబం దిగిన ఫొటో ఒక‌టి ఇప్ప‌టికే నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. దానికి ఇప్పుడీ ఆహ్వాన ప‌త్రిక వీడియో సిద్ధ‌మైంది. ఇక‌, రేప్పొద్దున పెళ్లి ఇంకేంత ఘ‌నంగా నిర్వ‌హిస్తారో అని జ‌న‌మంతా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.

Loading...

Leave a Reply

*