క‌డ‌పలో కొట్టుకున్న వైసీపీ, టీడీపీ నేత‌లు

kadapa

క‌డ‌ప‌లో కొట్టుకున్న టీడీపీ, వైపీపీ నేత‌లు బాహాబాహీకి దిగారు. జిల్లా ప‌రిష‌త్ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. దాంతో సమావేశ ప్రాంగ‌ణ‌మంతా గంద‌ర‌గోళం చెల‌రేగింది. వైసీపీ నేత‌లు రౌడీయిజం చేసి త‌మ‌పై దాడికి ప్ర‌య‌త్నించారంటూ టీడీపీ నేత‌లు ఆరోపించారు. అయితే, టీడీపీ నేత‌లే త‌మ‌పై దాడికి ప్ర‌య‌త్నించార‌ని వైసీపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేశారు. స‌మావేశంలో ఆరోప‌ణ‌ల‌తో మొద‌లైన చిన్న గొడ‌వ ఇరు వ‌ర్గాల మ‌ధ్య తోపులాట‌కు దారి తీసింది. టీడీపీ నేత‌ల సీట్ల వ‌ద్ద‌కు వ‌చ్చిన వైసీపీ నేత‌లు వారిపై దాడికి య‌త్నించారు. దానిని టీడీపీ నేత‌లు ప్ర‌తిఘ‌టించారు. టీడీపీ నేత‌లు కూడా వైసీపీ నేత‌ల‌పైకి వెళ్లారు. ఒక‌రినొక‌రు ఇష్ట‌మొచ్చిన‌ట్లు తిట్టుకుంటూ నువ్వెంతంటే నువ్వంత‌రా అనుకుంటూ స‌మావేశ ప్రాంగ‌ణాన్ని చేప‌ల మార్కెట్ చేశారు.

Loading...

Leave a Reply

*