జ‌గ‌న్ గూటికి మాజీ సీఎం కొడుకు..!

y-s-jagan

క‌ర్నూలు జిల్లా…. వైఎస్సార్సీకి ఖిల్లా….. గ‌త ఎన్నిక‌ల్లో ఆ జిల్లాలోని రెండు ఎంపీ స్థానాల‌ను, అత్య‌ధిక అసెంబ్లీ స్థానాల‌ను వైఎస్సార్సీ కైవ‌సం చేసుకుంది… జిల్లాలో జ‌గ‌న్ జెండా రెపరెప‌లాడింది….జ‌నం వైఎస్సార్సీకి జ‌య‌హో అన్నారు… జిల్లాలో 14 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉంటే 11 సీట్లు వైఎస్సార్సీ గెల్చుకోగా కేవ‌లం మూడు స్థానాల‌తోనే స‌రిపెట్టుకుంది టీడీపీ… అయితే చంద్ర‌బాబు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ప్ర‌యోగించ‌డంతో జిల్లాలో వైఎస్సార్సీకి రెక్క‌లు విరిగాయి…. 11మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు టీడీపీలోకి జంప‌యిపోయారు.. జిల్లా వైఎస్సార్సీకి పెద్ద‌దిక్కుగా ఉన్న భూమా నాగిరెడ్డితో పాటు వీళ్లంతా టీడీపీలో చేరిపోయారు… దీంతో జిల్లాలో వైఎస్సార్సీకి పెద్ద ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్టు అయింది…. జిల్లాలో బ‌డా నేత‌తో పాటు ఛోటామోటా నేతలు కూడా చేజారిపోవ‌డంతో జ‌గ‌న్‌కి ఝ‌ల‌క్ త‌గిలింది…

అయితే ఎక్క‌డ పోగొట్టుకున్నారో అక్క‌డే వెదుక్కోవాల‌న్న‌ట్టు క‌ర్నూలులో మ‌ళ్లీ పాగా వేసేందుకు జ‌గ‌న్ పావులు కదుపుతున్నార‌ని స‌మాచారం… జిల్లాలో భూమా నాగిరెడ్డితో ఢీ కొట్టే నేత ఒక్క‌డే ఉన్నాడు…. ఆయ‌నే మాజీ కేంద్ర‌మంత్రి, కాంగ్రెస్ నేత కోట్ల సూర్య‌ప్ర‌కాష్‌రెడ్డి…. కోట్ల తండ్రి విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి గ‌తంలో రెండుసార్లు ఏపీ సీఎంగా ప‌నిచేశారు… ఆయ‌న అప్ప‌ట్లో కాంగ్రెస్‌లో చాలా పెద్ద నేత‌… ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ చ‌చ్చిపోవ‌డంతో వైఎస్సార్సీ త‌ప్ప కోట్ల సూర్య‌ప్ర‌కాష్‌కి వేరే ఆప్ష‌న్ లేదు.. ఎందుకంటే ఆయ‌న ఎలాగూ బ‌ద్ధ‌శ‌త్రువు టీడీపీలో చేర‌లేరు…. దీంతో కోట్ల‌ను వైఎస్సార్సీలోకి ర‌మ్మ‌ని జ‌గ‌న్ ఆహ్వానించాట్ట‌… దీనికి కోట్ల కూడా సుముఖంగానే ఉన్నారుట‌…. కోట్ల వైఎస్సార్సీలో చేరితే చేజారిన క‌ర్నూలు కోట మ‌ళ్లీ చేజిక్కుతుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నాట్ట‌… దీంతో త్వ‌ర‌లోనే కోట్ల వైఎస్సార్సీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధ‌మైంద‌ని చెబుతున్నారు.

Loading...

Leave a Reply

*