ఎన్టీఆర్‌ని త‌ల‌పిస్తున్న ట్రంప్‌…!

trump

జ‌న‌హృద‌య‌నేత‌.. ఎన్టీఆర్‌.. ముఖ్య‌మంత్రిగా గెలిచిన త‌ర్వాత ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాల‌లో ఒక‌టి.. నెల జీతం రూపాయి మాత్ర‌మే తీసుకుంటాన‌ని. మొద‌ట తాను ప్ర‌జాసేవ కోస‌మే రాజ‌కీయాలలోకి వచ్చాన‌ని, అందుకే పైసా జీతం తీసుకోకుండా ప‌ని చేస్తాన‌ని చెప్పారు. అందుకు, నిబంధ‌న‌లు అడ్డు వ‌స్తాయ‌ని చెప్ప‌డంతో నెల‌కు రూపాయి జీతంతో ప్ర‌జా సేవ‌కు అంకితం అవుతాన‌ని వివ‌రించారు. ఆ నిర్ణయం ఆ త‌ర్వాత ఎంద‌రో రాజ‌కీయ నేత‌లు ఫాలో అయ్యారు. స‌రిగ్గా అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇలాంటి నిర్ణ‌య‌మే తీసుకున్నాడు.

అధ్య‌క్ష బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత ఏడాదికి ఒక్క డాల‌ర్‌నే జీతంగా తీసుకుంటాన‌ని వెల్ల‌డించారు. అమెరికా అధ్యక్షుడికి సాధార‌ణంగా ఏడాదికి 4 లక్ష‌ల డాల‌ర్‌ల జీతం వస్తుంది. ఇందులో భ‌త్యాల ఖ‌ర్చు కూడా ఉంటుంది. అంటే, నాలుగేళ్ల‌కి క‌లిపి 16 ల‌క్ష‌ల డాల‌ర్‌లు. దీనికి ఆయ‌న తీసుకోనున్న‌ది కేవ‌లం 4 డాల‌ర్‌లు మాత్ర‌మే. అయితే, అమెరికాలోని టాప్ బిజినెస్ మాగ్న‌ట్ అయిన ట్రంప్‌కి ఇది పెద్ద లెక్క కాదు. ఆయ‌న‌కు వేల కోట్ల రూపాయ‌ల ఆస్తి ఉంది. ట్రంప్‌కి డ‌బ్బు కొత్త కాదు. అధికార‌మే ఆయ‌న‌కు కావాల్సింది. అమెరికా ప్రెసిడెంట్‌గా తిరుగులేని అధికారం కావాలి. అందుకే, ఆయ‌న ఈ పాపులిస్టిక్ స్కీమ్‌కు తెర దీశాడ‌ని చెబుతున్నారు.

ట్రంప్ అధ్య‌క్ష ఎన్నిక‌ల‌లో గెలిచింది నిరుద్యోగ యువ‌త‌, త‌క్కువ చదువుకున్న ఓట‌ర్ల మ‌ద్ద‌తుతో. వారిని ఆక‌ట్టుకోవాలంటే ఇలాంటి ప్ర‌జాక‌ర్ష‌క ప‌థ‌కాలు త‌ప్ప‌నిస‌రి. అందుకే, ట్రంప్ వారిని సంతృప్తి ప‌ర‌చ‌డానికి, వారికోస‌మే ఈ నిర్ణయం తీసుకున్నాడంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి, ఇది ఎంత‌వ‌ర‌కు ఉప‌యోగ‌ప‌డుతుందో చూడాలి.

Loading...

Leave a Reply

*