ఏపీలో పంట‌ల‌న్నీ ఇక ఆన్‌లైన్‌లోనే!

ap

ఏపీలో వ్య‌వ‌సాయానికి ఇక టెక్ సాయం కానుంది. తాము అభివృద్ధి చేస్తున్న సాంకేతిక ప‌రిజ్ఞానంతో రాష్ట్రంలో సాగు చేయాల్సిన పంట‌లు, భూమి తీరు.. నీటి ల‌బ్య‌త ఇలా అన్ని విష‌యాల స‌మాచారం రైతుకు ప్ర‌తి నిమిషం అందుబాటులోకి తెస్తున్న‌ట్లు సీఎం చంద్ర‌బాబు చెప్పారు. రాష్ట్రంలోని రిజ‌ర్వాయ‌ర్లు, చెరువులు, కుంట‌ల‌న్నింటికి జియోట్యాగింగ్ చేస్తున్నామ‌న్నారు. దీంతో ఎక్క‌డ నుంచి ఎంత నీరు వ‌స్తుంది? ఎంత నిల్వ చేసుకోవ‌చ్చు. పంట‌ల‌కు ఎంత నీరు అందుబాటులో ఉంటుంది అన్న విష‌యాల‌ను స‌రైన స‌మ‌యంలో తెలిసే అవ‌కాశ‌ముంటుంద‌ని తెలిపారు.

డిజిట‌ల్ ఇండియా స‌ద‌స్సుల్లో చంద్ర‌బాబు మాట్లాడుతూ… టెక్నాల‌జీని వినియోగించుకుంటే ఎన్ని అద్భుతాలు చేయొచ్చో వివ‌రించారు. నేల‌లో ఉన్న తేమ‌, ఏ పంట‌కు ఎంత త‌డి ఇవ్వాలి ఇలా అన్ని విష‌యాల‌ను క‌చ్చితంగా తెలుసుకోవ‌చ్చ‌న్నారు. గ‌తంలో దెయ్యాలు కూడా పించ‌న్లు తీసుకున్న ప‌రిస్థితి ఉండేద‌ని, వేలిముద్ర‌లు, ఐరీష్‌ల‌ను తీసుకుని కొత్త టెక్నాలజీని వినియోగించ‌డం వ‌ల్ల అక్ర‌మాల‌కు చెక్ పెట్టామ‌ని చంద్ర‌బాబు తెలిపారు.

Loading...

Leave a Reply

*