పాక్‌పై ప‌గ తీర్చుకున్న ఇండియా?

ind-vs-pak

ఉడీలో 18మంది సైనికుల మ‌ర‌ణానికి కార‌ణ‌మైన పాపిస్తాన్ పాక్‌పై సామాన్య భార‌తీయులే కాదు సైన్యం కూడా మండిప‌డుతోంది… క‌న్నుకు క‌న్ను ప‌న్నుకు ప‌న్నుకావాలి…. గన్నుకు గ‌న్నుతోనే బ‌దులిస్తాం అంటున్నారు భార‌తీయులు.. ర‌క్తానికి ర‌క్తంతోనే స‌మాధానం ఇస్తాం అంటూ సైనికుల‌తో పాటు సామాన్యులు కూడా శ‌ప‌థాలు చేస్తున్నారు…. అయితే కేంద్రంలోని మోదీ స‌ర్కార్ మాత్రం స‌న్నాయి నొక్కులు నొక్కుతోంది… పాక్‌పై సైనిక చ‌ర్య‌కు త‌ట‌ప‌టాయిస్తోంది… అమెరికాకు కంప్ల‌యింట్ చేస్తాం, ఐక్య‌రాజ్య‌స‌మితిలో చ‌ర్చిస్తాం, పాక్‌కు సాక్ష్యాలు చూపిస్తాం, అంత‌ర్జాతీయ స‌మాజంలో పాక్‌ని ఒంటరిని చేస్తాం అంటూ మోదీ స‌ర్కార్ శాంతి మంత్రం ప‌ఠిస్తుండ‌డంతో భార‌తీయుల్లో అశాంతి రేగుతోంది…

అధికారంలోకి రాకముందు మోదీ ఎన్ని క‌బుర్లు చెప్పారు… అధికారం ఇస్తే పాక్‌ని షేక్ చేసి బ్రేక్ చేస్తామ‌న్నారు…. పాక్ ప‌ని ప‌డ‌తామ‌న్నారు… ఇప్పుడు చూడండి…చేతులు ముడుచుకుని కూర్చున్నారు అని జ‌నం ఎద్దేవా చేస్తున్నారు… అయితే జ‌నం ఎద్దేవా చేసిన‌ట్టు మోదీ చేతులు ముడుచుకుని కూర్చోలేదుట‌… ఓ భారీ సీక్రెట్ ఆప‌రేష‌న్‌కి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారుట‌.. భార‌తీయ ఆర్మీ అత్యంత ర‌హ‌స్యంగా పాక్‌లోకి చొచ్చుకువెళ్లి చాలామంది ఉగ్ర‌వాదుల‌ను ఏరిపారేసిందిట‌…. ఉడీ ఉగ్ర‌వాద దాడితో ర‌గిలిపోతున్న భార‌తీయ సైన్యం పాక్‌లో ఓ భారీ కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించి 20మంది పాకిస్తానీ ఉగ్ర‌వాదుల్ని ఏరిపారేసిందని తాజాగా క్వింట్‌.కామ్‌లో ఓ క‌థ‌నం ప్ర‌చురించారు…

ఈ క‌థ‌నం ప్ర‌కారం భార‌త ఆర్మీకి చెందిన అత్యున్నత పారా మిల‌ట‌రీ యూనిట్లు రెండు పాకిస్తాన్ ఆక్ర‌మిత కాశ్మీర్‌..పీవోకేలో ఓ ర‌హ‌స్య ఆప‌రేషన్ నిర్వ‌హించాయి.. 18మంది సైనికుల‌ను పొట్ట‌న పెట్టుకున్న ఉడీ ఉగ్ర‌వాద దాడి జ‌రిగిన రెండు రోజుల త‌ర్వాత సెప్టెంబ‌ర్ 20-21 అర్ధ‌రాత్రి ఈ ఆప‌రేష‌న్ జ‌రిగిందిట‌…హెలికాప్ట‌ర్ల‌లో 18 నుంచి 20 మంది సైనికులు పీవోకేలో అడుగుపెట్టి ఉగ్ర‌వాద స్థావ‌రాల‌పై దాడులు చేశారు.. ఈ దాడుల్లోక‌నీసం 20మంది పాకిస్తానీ ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యార‌ని స‌మాచారం. అయితే ఈ క‌థ‌నాన్ని ర‌క్ష‌ణ శాఖ అధికారులు కానీ, ప్ర‌భుత్వ వ‌ర్గాలు కానీ ధ్రువీక‌రించ‌డం లేదు.

Loading...

Leave a Reply

*