బాబుకు దేవాన్షు పేప‌ర్ ముద్దులు

chandra-babu

త‌న కుమారుడిని చూడ‌డానికి కూడా తండ్రి రావ‌డం లేదంటూ చంద్ర‌బాబుపై నారా లోకేశ్ నిష్టూరాలు మొన్న‌టి వార్త‌. మ‌న‌వ‌డిని కూడా చూడ‌లేక‌పోతున్న‌ని, తాను దూరంగా ఉండ‌డంతో దేవాన్షు త‌న‌ను గుర్తు ప‌ట్ట‌డం లేద‌న్నది నిన్న‌టి చంద్ర‌బాబు ఆవేద‌న‌. పేప‌ర్‌లో తాత ఫొటో చూసి ముద్దులు పెడుతున్న దేవాన్ష్‌. ఇది తాజాగా లోకేశ్ చెప్పిన హాట్ న్యూస్‌. రాష్ట్రం కోసం అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డుతున్న చంద్ర‌బాబు త‌న కుటుంబాన్ని కూడా త్యాగం చేశార‌ని లోకేశ్ వెల్ల‌డించారు. గుంటూరులో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. త‌న కుటుంబం హైద‌రాబాద్‌లో ఉండ‌డం చంద్ర‌బాబు అక్క‌డికి ఎప్పుడోకానీ రాక‌పోతుండ‌డంతో త‌న కుమారుడు దేవాన్ష్ తాత‌ను చాలా మిస్ అవుతున్నాడ‌ని లోకేశ్ వ్యాఖ్యానించారు

పేప‌ర్‌లో తాత ఫొటోల‌ను చూసి వాటికే దేవాన్ష్ ముద్దులు పెడుతూ మురిసిపోతున్నాడ‌ని లోకేశ్ వెల్ల‌డించారు. నాలుగు రోజుల క్రితం చంద్ర‌బాబు హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడు అత‌డిని చూసి దేవాన్ష్ అస‌లు గుర్తు ప‌ట్ట‌లేద‌ని లోకేశ్ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. తాత‌ను ముద్దు పెట్టుకోమ‌ని తాము చెబుతుంటే దేవాన్ష్ నేరుగా వెళ్లి పేప‌రుపై ఉన్న చంద్ర‌బాబుకు ముద్దు పెట్టాడ‌ని, ప‌క్క‌నే ఉన్న తాత‌ను మాత్రం ప‌ట్టించుకోలేద‌ని లోకేశ్ అన్నారు.

Loading...

Leave a Reply

*