ఫిరాయింపు ఎమ్మెల్యేల ఆశ‌ల‌పై బాబు నీళ్లు!

babu

వైసీపీ నుంచి అధికార పార్టీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల ఆశ‌ల‌పై చంద్ర‌బాబు నీళ్లు చ‌ల్లారా? పండుగ నాడు కొత్త ప‌ద‌వుల్లో కుదురుకోవాల‌ని భావించిన టీడీపీ నేత‌ల ఆశ‌ల‌ను సీఎం అడియాశ‌లు చేశారా? ఈ ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌స్తుతానికి అవున‌నే స‌మాధానం చెప్పుకోవాల్సి వ‌స్తుంది. ఎందుకంటే వ‌చ్చే ద‌స‌రాకే కేబినెట్ విస్త‌ర‌ణ అంటూ ఊరించి ఊరించి ఉసురుమ‌నిపించారు చంద్ర‌బాబు. కార‌ణం ద‌స‌రా పండుగ కూడా ముగిసిపోతుంది. కాని మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు సంబంధించి చ‌ర్చ‌లేవీ బ‌య‌ట న‌డ‌వ‌డం లేదు. ప్ర‌భుత్వంలోనూ ఆ దిశ‌గా ఏదోక‌టి జ‌రుగుతున్న‌ట్లుగా ఏమీ క‌నిపించ‌డం లేదు. అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు కావ‌డం… పార్టీలో మంత్రి ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్న వారికి న్యాయం చేయ‌డం…

ఇత‌ర పార్టీల్లోంచి వ‌చ్చిన వారికి ఇచ్చిన హామీల‌ను నిల‌బెట్టుకోవ‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంల ద‌స‌రాకు కేబినెట్ విస్త‌ర‌ణ జ‌రుగుతుంద‌ని వార్త‌లొచ్చాయి. నెల క్రిత‌మే దీనిపై చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు చేసిన‌ట్లు టీడీపీ నేత‌లంతా చెవులు కొరుక్కున్నారు. ఏమైందో తెలియ‌దు కానీ ద‌స‌రా అయిపోతున్నా కేబినెట్ విస్త‌ర‌ణ ఊసే లేదు. ఇప్ప‌టికున్న స‌మాచ‌రం ప్ర‌కారం కేబినెట్ విస్త‌ర‌ణ వాయిదా ప‌డిన‌ట్లేన‌ని తెలుస్తోంది. మంత్రి కావాల‌నుకున్న‌వారు…. మంత్రిని చేస్తాన‌ని చంద్ర‌బాబు హామీ పొందిన వారు మ‌రికొంత కాలం ఎదురు చూడాల్సిన ప‌రిస్థితి త‌ప్ప‌ద‌ని అర్థ‌మ‌వుతోంది.

Loading...

Leave a Reply

*