ఏపీలో కాంగ్రెస్‌కు బ‌తుకుందా?

congress

ఏపీలో చ‌చ్చిపోయిన కాంగ్రెస్‌కు తిరిగి ప్రాణం పోయ‌డంపై ఆ పార్టీ నేత‌లు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేనంత‌గా కాంగ్రెస్ పునాదుల‌తో స‌హా పెకిలించుకుపోయింది. ద‌శాబ్దాలుగా కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన క‌ర‌డుగ‌ట్టిన కాంగ్రెస్ వాదులంతా ఆ త‌ర్వాత టీడీపీలో, బీజేపీలో చేరిపోయారు. ఏ పార్టీలో చేరే అవ‌కాశం లేనివాళ్లే ప్ర‌స్తుతం కాంగ్రెస్‌లో ఉంటున్నారు. వాళ్లు కూడా ఏదోక మ‌న‌కూ మంచి ఆఫ‌ర్ రాక‌పోతుందా అని ఎదురు చూస్తున్న‌వారే అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో తిరిగి కాంగ్రెస్‌కు పూర్వ వైభ‌వం తేవ‌డంపై ఆ పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఏపీ రాజ‌ధాని విజ‌య‌వాడ‌లో ప్ర‌త్యేక స‌మావేశాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హిస్తోంది.

దీనికి దిగ్విజ‌య్ సింగ్‌, కొప్పుల రాజు, కుంతియా త‌దిత‌ర ఏఐసీసీ నేత‌లు, రాష్ట్ర ముఖ్య నేతలంతా హాజ‌ర‌వుతున్నారు. ఈ సంద‌ర్భంగానే రాష్ట్రంలో పార్టీని పున‌రుజ్జీవింప చేయ‌డంపై పోస్టుమార్టం నిర్వ‌హించ‌నున్నారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్‌లో ఒక‌రిద్ద‌రు ముఖ్య నేత‌ల్లో ఒక‌రైన చిరంజీవి కూడా టీడీపీలో చేర‌నున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. వీటిని చిరంజీవి కూడా ఖండించ‌లేదు. ఆయ‌న త‌ర‌ఫున మాట్లాడుతున్నానంటూ రామ‌చంద్ర‌య్య ఒక ఖండ‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ప‌రిస్థితుల్లో జ‌రుగుతున్న కాంగ్రెస్ స‌మావేశంలో ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారో… ఏ విధంగా కాంగ్రెస్‌ను ముందుకు తీసుకెళ్లాల‌ని వ్యూహాలు ర‌చిస్తారో చూద్దాం.

Loading...

Leave a Reply

*