కేసీఆర్‌కు కాంగ్రెస్సే దిక్కా?

kcr

తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తాన‌ని కేసీఆర్ హామీఇచ్చారు. అయితే, చివ‌ర‌కు ఆ హామీ ఎన్నిక‌ల‌లో నేత‌లు ఇచ్చే హామీ మాదిరేఅది కూడా మురిగిపోయింది. అంత‌టితో అయిపోకుండా రాష్ట్రంలో కాంగ్రెస్‌కేఎర్త్ పెట్టే స్థాయికి కేసీఆర్ చేరుకున్నారు. అధికారం చేప‌ట్టిన త‌ర్వాత టీడీపీని, కాంగ్రెస్‌ను చిన్నాభిన్నం చేయ‌డంలో కేసీఆర్స‌ఫ‌లీకృతుల‌య్యారు. ఈ రెండు పార్టీల‌ను నామ రూపాల్లేకుండా చేయాల‌నిభావించిన కేసీఆర్ అందులో 80 శాతం విజ‌యం సాధించారు. ఆ క్ర‌మంలోనే తానుబ‌లంగా ఉండాలంటే జాతీయ స్థాయిలో పెద్ద పార్టీతో మిత్ర‌త్వం ఉండాల‌ని కాబ‌ట్టి బీజేపీకి ద‌గ్గ‌ర కావ‌డానికి ప్ర‌య‌త్నించారు. ఆ క్ర‌మంలోనే మోడీని తీసుకొచ్చి త‌న క‌ల‌ల ప్రాజెక్టు అయిన మిష‌న్ భ‌గీర‌థ‌ను ఆవిష్క‌రింప‌చేయించారు.

అయితే, అనూహ్యంగా బీజేపీకి కూడా తాము బాగా క‌ష్ట‌ప‌డితే రాష్ట్రంలో నిల‌దొక్కుకుని వ‌చ్చే ఎన్నిక‌ల‌లో కాకున్నా ఆ త‌ర్వాత‌కైనా అధికారంలోకి వ‌స్తామ‌న్న భ‌రోసా క‌నిపించింది. దాంతో వారు సొంతంగా ఎదిగే ప‌ని మొద‌లెట్టారు. దీంతో క‌మ‌ల‌నాథుల‌కు ద‌గ్గ‌ర కావాల‌నుకున్న కేసీఆర్ క‌ల క‌ల‌గానే మిగిలే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. తాను క‌లుస్తానంటున్న బీజేపీ ద‌గ్గ‌ర‌కు రానీయ‌ని ప‌రిస్థితి ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కాంగ్రెస్సే కేసీఆర్‌కు ప్ర‌త్యామ్నాయంగా క‌నిపిస్తోంది. ఇప్పటికైతే కేసీఆర్‌కు ఇలాంటి ఆలోచ‌న లేకున్నా కేంద్రంలో ప‌రిస్థితులు అటూ ఇటూ అయితే కాంగ్రెస్‌కు ద‌గ్గ‌ర కావాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది.

Loading...

Leave a Reply

*