సుజ‌నా కోసం న‌డిరోడ్డుపై నిలిచిన సీఎం కాన్వాయ్‌

sujana-chowdary

కేంద్ర‌మంత్రి సుజ‌నాచౌద‌రి అంటే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు గ‌ట్టిగురి. ఆయ‌న కోసం సీఎం ఎంతైనా చేస్తారు. అధికారంలో లేన‌ప్పుడు పార్టీ కోసం క‌ష్ట‌ప‌డ్డారంటూ అధికారంలోకి రాగానే ఎంపీని చేశారు. కేంద్రంలో మోడీ పెద్ద‌గా ఆస‌క్తి చూప‌క‌పోయిన మంత్రిని చేశారు. సుజ‌నాపై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చిన సీఎం మాత్రం ఆయ‌న‌ను వెన‌కేసుకొస్తారు. తాజాగా సుజ‌నా కోసం ముఖ్య‌మంత్రి నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా, త‌న భ‌ద్ర‌త‌ను ప‌ణంగా పెట్టి మ‌రీ న‌డిరోడ్డుపై కారు ఆపేశారు. అమ‌రావ‌తి శంకుస్థాప‌న ముగిసిన త‌ర్వాత గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టు నుంచి తిరిగి వ‌స్తుండ‌గా ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. జైట్లీని విమానాశ్ర‌యం వ‌ర‌కూ సాగ‌నంపి ముఖ్య‌మంత్రి తిరుగు ప‌య‌న‌మ‌య్యారు.

ఆయ‌న కారులోనే సుజ‌నా కూడా తిరిగి వ‌స్తున్నారు. అయితే, జైట్లీ వెళ్లున్న విమానంలోనే సుజ‌నా కూడా ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. బెంజ్ స‌ర్కిల్ వ‌ద్ద‌కు సీఎం కాన్వాయ్ చేరుకునే స‌రికి స‌మ‌యం చాల‌ద‌న్న విష‌యం సుజ‌నాకు అర్థ‌మైంది. దాంతో ఆయ‌న తాను వేరే కారులో వెన‌క్కి వెళ్తాన‌ని చెప్ప‌డంతో సీఎం త‌న కాన్వాయ్‌ని న‌డిరోడ్డు మీద ఆపేశారు. ఆయ‌న దిగి వెళ్లిపోయిన త‌ర్వాత సీఎం త‌న కాన్వాయ్‌ని ముందుకు పోనిచ్చారు. అస‌లే రాష్ట్రంలో అతిపెద్ద ఎన్‌కౌంట‌ర్ జ‌రిగి ప‌రిస్థితి కొంత ఆందోళ‌న‌క‌రంగా ఉంది. ఇలాంటి స‌మ‌యాల‌లో కాన్వాయ్‌ని ఇలా న‌డిరోడ్డుమీద నిలిపేయ‌డంపై భ‌ద్ర‌తా అధికారులు ఒకింత క‌ల‌వ‌రానికి గుర‌య్యారు.

Loading...

Leave a Reply

*