ప‌వ‌న్‌పైకి అన్న‌య్య‌… టీడీపీ స‌రికొత్త అస్త్రం!

pawan-kalyan

రాష్ట్రంలో చెల‌రేగిపోతున్న జ‌న‌సేనకు చెక్ పెట్టాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారా? ప‌్ర‌త్యేక హోదా సెంటిమెంట్‌తో దూసుకుపోతున్న ప‌వ‌న్‌కు క‌ళ్లెం వేయాల‌ని టీడీపీ అధినేత రంగంలోకి దిగారు. త‌మ్మడు పైకి అన్న‌య్య‌ను ఆయుధంగా ప్ర‌యోగించాల‌ని భావిస్తున్నారా? ఈ ప్ర‌శ్న‌లన్నింటికీ దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇది. త్వ‌ర‌లో టీడీపీలోకి చిరంజీవి. ప్ర‌జా రాజ్యం పెట్టి అది సాగ‌క‌, కాంగ్రెస్‌లో చేరి ఇప్పుడు అక్క‌డు ఉన్న చిరంజీవిని సైకిల్ ఎక్కించుకోవాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారంటూ వార్త‌లు బ‌య‌ట‌కొచ్చాయి. ఇందుకు సంబంధించి గ్రౌండ్ వ‌ర్క్ పూర్త‌యింద‌ని చిరంజీవి కూడా త‌న స‌మ్మ‌తిని తెలిపార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

చంద్ర‌బాబు ఆదేశాల‌తో ఆయ‌న త‌న‌యుడు నారా లోకేశ్ రంగంలోకి దిగి నేరుగా చిరంజీవితోనే సంప్ర‌దింపులు జ‌రిపార‌ని తాజా స‌మాచారం. ఆ సంప్ర‌దింపుల‌లో టీడీపీలోకి రావ‌డానికి త‌న‌కేం అభ్యంత‌రం లేద‌ని త‌న‌కు ప‌ద‌వులు కూడా వ‌ద్ద‌ని చిరంజీవి చెప్పార‌ని దాంతో ఆయ‌న చేరిక‌కు ముహుర్తం నిర్ణ‌యించే ప‌నిలో టీడీపీ నేత‌లు ఉన్నార‌ని లేటెస్ట్ హాట్ న్యూస్‌. ప్ర‌స్తుతం తాను రాజ్య‌స‌భ స‌భ్యునిగా ఉన్నందున అదే ప‌దవిలో కొన‌సాగుతాన‌ని చిరంజీవి ఈ సంద‌ర్భంగా లోకేశ్‌కు చెప్పార‌ట‌. ప్ర‌స్తుతం కాంగ్రెస్ కార్య‌క్ర‌మాల‌కు కూడా దూర‌మైన చిరంజీవి త‌న 150వ సినిమాలో బిజీగా ఉన్నారు.

ఆ సినిమా షూటింగ్ పూర్త‌య్యి అన్ని అనుకూలిస్తే డిసెంబ‌ర్‌లో టీడీపీ కండువా క‌ప్పుకోవాల‌ని చిరంజీవి, లోకేశ్ అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలిసింది.

Loading...

Leave a Reply

*