టీడీపీలో చేరిక‌పై నోరు విప్ప‌ని చిరంజీవి!

chiru

కాంగ్రెస్ నేత‌, ఒక‌ప్ప‌టి పీఆర్పీ అధినేత చిరంజీవి టీడీపీలో చేర‌తారంటూ సోష‌ల్ లోకేం కోడై కూస్తోంది. మీడియాలో వార్త‌లు ప‌తాక శీర్షిక‌లై పాఠ‌కుల‌కు చేరుతున్నాయి. అయితే, త‌న గురించి, తాను పార్టీ మారుతాన‌న్న విష‌యంపైనా ఇంత పెద్దఎత్తున ప్రచారం సాగుతున్నా చిరంజీవి మాత్రం మౌనం పాటిస్తున్నారు. రాజ‌కీయాల‌కు స్వ‌ల్ప విరామం ప్ర‌క‌టించి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న చిరంజీవి రాజ‌కీయాల‌పై ప్ర‌స్తుతానికి స్పందించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నారేమో తెలియ‌దు. అయితే, చిరంజీవి మౌనాన్ని జ‌నం మ‌రో ర‌కంగా అర్థం చేసుకుంటున్నారు. టీడీపీలోకి చిరంజీవి వ‌స్తున్న విష‌యాన్ని వారు సీరియ‌స్‌గానే న‌మ్మే ప‌రిస్థితి వ‌స్తోంది.

ఇక‌, దీనిపై చిరంజీవి స్పందించ‌క‌పోయినా కాంగ్రెస్ నేత సీ రామచంద్ర‌య్య మాత్రం నోరు విప్పారు. చిరంజీవి పార్టీ మారుతున్న వార్త‌ల‌న్నీ నిరాధార‌మ‌ని తేల్చి చెప్పారు. ఇదే విష‌యం చిరంజీవి త‌న‌కు ఫోన్ చేసి చెప్పార‌ని రామ‌చంద్ర‌య్య అంటున్నారు. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ను గంద‌ర‌గోళం చేయ‌డానికే ఇలాంటి వార్త‌ల‌ను ప్ర‌చారంలోకి తెస్తున్నార‌ని రామ‌చంద్ర‌య్య ఆరోపించారు. చిరు సూచ‌న మేర‌కే తాను ఈ ప్ర‌క‌ట‌న చేస్తున్న‌ట్లు తెలిపారు. అయితే, చిరంజీవి త‌న త‌ర‌ఫున రామ‌చంద్ర‌య్య‌ను మాట్లాడ‌మ‌నే కంటే విష‌యం త‌న‌కు తెలిసింది కాబ‌ట్టి తానే స్వ‌యంగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తే పార్టీ మారుతున్నార‌న్న ప్ర‌చారానికి తెర ప‌డుతుంది క‌దా అన్న‌ది కొంద‌రి ధ‌ర్మ సందేహం.

నేరుగా చిరంజీవి స్పందించ‌డం లేదు కాబ‌ట్టి… ఆయ‌న త‌ర‌ఫున మాట్లాడిన వారి మాట‌ల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోన‌క్క‌ర్లేద‌ని చిరంజీవి మ‌న‌సులో ఏదో ఉంద‌ని ఏపీలోని రాజ‌కీయ నేత‌ల ఉద్దేశం.

Loading...

Leave a Reply

*