లిఫ్ట్ జారిప‌డి చిన‌రాజ‌ప్ప‌కు గాయాలు

china-rajappa

ఏపీ డిప్యూటీ సీఎం చిన‌రాజ‌ప్ప పెను ప్ర‌మాదం నుంచి తృటిలో త‌ప్పించుకున్నారు. కాకినాడ‌లో సంజీవ‌ని ఆస్ప‌త్రిలో ఆయ‌న లిఫ్ట్‌లో వెళ్తుండ‌గా అది తెగి ప‌డిపోయింది. దాంతో అందులో ఉన్న రాజ‌ప్ప స‌హా ప‌లువురికి గాయాల‌య్యాయి. ఆ వెంట‌నే వైద్యులు అత‌డికి చికిత్స ప్రారంభించారు. రాజ‌ప్ప న‌డుం వ‌ద్ద గాయ‌మైన‌ట్లు స‌మాచారం. గ్యాస్ లీకేజీ ప్ర‌మాద బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు రాజ‌ప్ప మంగ‌ళ‌వారం ఉద‌యం ఆస్ప‌త్రికి వ‌చ్చారు. ఆ సంద‌ర్భంలోనే ఈ ప్ర‌మాదం జ‌రిగింది. హోంమంత్రి స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ‌డంతో అంద‌రూ ఊపీరి పీల్చుకున్నారు.

Loading...

Leave a Reply

*