వంశీ కాస్త త‌గ్గాలి.. బాబు క్లాస్‌..!

vamsi

కృష్ణా జిల్లా టీడీపీ రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో ప‌డ్డాయి. కాంంగ్రెస్‌లో కీల‌కంగా ఉన్న దేవినేని నెహ్రు దేశంలోకి పున‌రాగ‌మ‌నం ఇప్ప‌టికే టీడీపీలో ఉన్న నేత‌లు ప‌లువురికి న‌చ్చ‌లేదు. దాంతో ఈ విష‌యాన్ని ఆయా నేత‌లు చంద్ర‌బాబు వ‌ద్దే త‌మ వ్య‌తిరేక‌త‌ను వ్య‌క్తం చేశారు. దాంతో వారికి చంద్ర‌బాబు ఒక రేంజ్‌లో క్లాస్ తీసుకుని చివ‌ర‌కు న‌చ్చ చెప్పార‌ట‌. అధినేత చెబుతున్న మాట‌ల‌కు స‌ద‌రు నేత‌లు క‌న్వీన్స్ అయిన‌ప్ప‌టికీ త‌మ‌లోని ఆగ్ర‌హాన్ని మాత్రం ఇంకా కొన‌సాగిస్తున్నార‌ని స‌మాచారం. ఇందులో ప్ర‌ధానంగా చెప్పుకోవాల్సింది… జిల్లాలోని పెన‌మ‌లూరు ఎమ్మెల్యే బోడే ప్ర‌సాద్‌, మ‌రో ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీలు. వీరిద్ద‌రూ దేవినేని నెహ్రూ పున‌రాగ‌మ‌నాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించార‌ట‌. నేరుగా చంద్ర‌బాబుతో స‌మావేశ‌మై త‌మ వ్య‌తిరేక‌త‌ను వెల్ల‌డించార‌ట‌.

మ‌రో రోజులో దేవినేని పార్టీలో చేర‌నుండ‌గా ఇలా కొంద‌రు నేత‌లు దానిని వ్య‌తిరేకిస్తూ త‌న వ‌ద్ద‌కు రావ‌డంతో విస్తుపోయిన బాబు… మీ నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఎవ‌రూ వేలు పెట్ట‌ర‌ని భ‌రోసా ఇస్తూనే కొత్త‌వారిని తీసుకోకుంటే పార్టీ బ‌ల‌ప‌డే అవ‌కాశం ఉండ‌ద‌ని తేల్చి చెప్పార‌ట‌. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్‌విభ‌జ‌నతో జిల్లాలో కొత్త‌గా ఐదు స్థానాలు పెర‌గ‌నున్నాయి. వీట‌న్నింటిలో బ‌ల‌మైన నేత‌ల‌ను త‌యారు చేసుకోవాల‌ని అందుకే కొత్త‌గా పార్టీలోకి వ‌స్తున్న జ‌న‌బ‌లం ఉన్న ఇత‌ర పార్టీ నేత‌ల‌ను ఆహ్వానించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశార‌ట‌. బాబు మాట‌ల‌కు త‌లూపిన ఈ నేత‌లు సైలెంట్‌గా బ‌య‌ట‌కొచ్చేశారు. అయితే, నెహ్రూ పార్టీలో చేరిన స‌భ‌కు మాత్రం గైర్హాజ‌ర‌య్యారు.

వీళ్ల‌కు తోడు విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బొండా ఉమ కూడా దేవినేని చేరిక స‌భ‌లో క‌నిపించ‌లేదు. నెహ్రుకు, ప్ర‌సాద్‌కు మ‌ధ్య ఉన్న ఇసుక రీచ్‌ల వివాదం, కాంగ్రెస్‌లోఉన్న‌ప్పుడే దేవినేని, వ‌ల్ల‌భ‌నేని మ‌ధ్య వైరంతో వీరిద్ద‌రూ ఇప్పుడు నెహ్రు టీడీపీ ప్ర‌వేశాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని స‌మాచారం. కాగా, దేవినేని చేరిక స‌భ‌లోనే చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు పార్టీలోని వ్య‌తిరేక స్వ‌రాన్ని బ‌య‌ట‌పెడుతున్నాయి. పార్టీలోకి కొత్త‌వారు రావ‌డాన్ని కొంద‌రు అంగీక‌రించ‌లేక‌పోతున్నారంటూ చంద్ర‌బాబు బ‌హిరంగంగానే వ్యాఖ్యానించారు. ఏదైతేనేం నెహ్రు పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు వీరంతా జిల్లాలో ఎలా క‌లిసిమెలిసి ప‌నిచేస్తారో… బాబు వారిని ఎలా క‌లిపి ఉంచుతారో చూడాల్సి ఉంది.

Loading...

Leave a Reply

*