నోట్ల ర‌ద్దుపై చంద్ర‌బాబు స‌ర్వే.. వెంట‌నే రూట్ మార్చాడు..!

unnamed

మోదీ తీసుకున్న నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారం దేశాన్ని షేక్ చేస్తోంది. సామాన్యులు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. న‌ల్ల కుబేరుల ఆట క‌ట్ అంటూ మోదీ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో సామాన్యుల‌కే ఎక్కువ‌గా ఇబ్బందిగా మారిన‌ట్లు క‌నిపిస్తోంది. నోట్ల ర‌ద్దు అంశాన్ని చంద్ర‌బాబు స్వాగ‌తించారు. దేశానికి ఇది మేలు చేస్తుంద‌ని అన్నారు. వాస్త‌వానికి గ‌త కొన్నేళ్లుగా బాబే స్వ‌యంగా పెద్ద నోట్ల అంశాన్ని లేవ‌నెత్తుతున్నారు. 500, 1000 నోట్ల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అందుకే, మోదీ దానిపై ఓ ప్ర‌క‌ట‌న చేశారో లేదో.. చంద్ర‌బాబు శ‌భాష్ అంటూ మెచ్చుకున్నారు. కానీ, మొద‌టిరోజు కంటే పరిస్థితి ఇప్పుడు మారింది.

సాధార‌ణ ప్ర‌జ‌ల‌లో కాస్త వ్య‌తిరేక‌త వ‌చ్చింది. దీంతో, చంద్ర‌బాబు దీనిపై ఓ స‌ర్వే నిర్వ‌హించార‌ట‌. ఇది ఆన్ లైన్ స‌ర్వే అని స‌మాచారం. ఈ స‌ర్వేలో నోట్ల ర‌ద్దు అంశంపై జ‌నాలు ఏమ‌నుకుంటున్నారో అని ఆయ‌న రిపోర్ట్ తీసుకున్నార‌ట‌. అంతా పాజిటివ్‌గా ఉంద‌ని.. దాదాపు 52 శాతం మంది ప్ర‌జ‌లు దీనికి ఓకే అంటున్నార‌ని, మోదీ నిర్ణ‌యాన్ని ఆహ్వానిస్తున్న‌ట్లు తెలిపారు. మిగ‌తా 48 శాతం ప్ర‌జ‌ల‌లో కొంద‌రు వ్య‌తిరేకిస్తున్న‌ట్లు చెప్ప‌గా, మ‌రికొందరు ప‌ర్లేదు అనే స‌మాధానం ఇచ్చార‌ట‌. దీంతో, మెజారిటీ ప్ర‌జ‌లు మోదీకే చెయ్యెత్తి జో కొడుతుండ‌గా వెంట‌నే చంద్ర‌బాబు త‌న ఆలోచ‌న‌ల‌కు ప‌దును పెట్టార‌ట‌.

ఎప్పటిక‌ప్పుడు అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చెయ్య‌డం, వారు తీసుకోవాల్సిన చ‌ర్య‌లను వివ‌రించ‌డం చేస్తున్నాడ‌ట‌. అందుకే, మొన్న సోమ‌వారం రోజు దేశ‌వ్యాప్తంగా బ్యాంక్‌ల‌న్నీ సెల‌వులతో మూసివెయ్య‌గా, ఏపీలో బ్యాంక్‌లు సేవ‌లందించాయి. అంతేకాదు, రాష్ట్ర‌వ్యాప్తంగా గుళ్లలో చందాలుగా వ‌స్తున్న చిల్ల‌ర డ‌బ్బును వెంట‌నే బ్యాంక్‌ల‌కు, జ‌నాల‌కు అందుబాటులో ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు సూచించాడు. ఇలా కొంత‌వ‌ర‌కు ఏపీలో డ్యామేజ్ కంట్రోల్ చెయ్య‌డంలో బాబు స‌క్సెస్ అయ్యాడ‌ని చెప్పుకుంటున్నారు ప్ర‌జ‌లు. మ‌రోవైపు, స‌ర్వే రిపోర్ట్‌ని ప్ర‌తి రోజు తెప్పించుకుంటున్నాడ‌ట చంద్ర‌బాబు. మొత్త‌మ్మీద‌, చిన్న అంశం పాజిటివ్‌గా క‌నిపించిందంటే ఆయ‌న రెచ్చిపోతారని మ‌రోసారి ప్రూవ్ అయింది.

Loading...

Leave a Reply

*