జ‌గ‌న్ న‌ల్ల‌ధ‌నం లెక్క‌లు చెప్పిన బాబు!

chandra-babu

రాష్ట్రంలో ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారుల‌కు ప‌దివేల కోట్లు చెల్లించింది జ‌గనేన‌ని టీడీపీ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు. రాష్ట్ర‌మంత్రుల సైతం అదే మాట‌ల‌ను వ‌ల్లెవేస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వ‌ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆదాయ ప‌న్ను క‌ట్టిన వారి వివ‌రాలు బ‌య‌ట‌కి వెల్ల‌డించకూడాదంటూనే జ‌గ‌న్‌పై రాష్ట్ర ప్ర‌భుత్వంలోని నేత‌లు జ‌గ‌న్‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఇప్పుడు చంద్ర‌బాబు కూడా ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. ప‌ది వేల కోట్లు చెల్లించ‌డం ద్వారా రాష్ట్రంలో ఒక రాజ‌కీయ పార్టీ నేత త‌న న‌ల్ల‌ధ‌నాన్ని వైట్ చేసుకున్నార‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. దేశంలోనే అత్య‌ధికంగా ప‌దివేల కోట్ల రూపాయల ఆదాయ‌ప‌న్ను క‌ట్టిన వ్య‌క్తి ఇక్క‌డి వాడేన‌ని ఆ వ్య‌క్తి ఎవ‌రో బ‌య‌ట‌పెట్ట‌డానికి నిబంధ‌న‌లు అడ్డువ‌స్తున్నాయ‌ని చంద్ర‌బాబు అన్నారు. అయితే, రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ ఆ వ్య‌క్తి ఎవ‌రో తెలుసంటూ ప‌రోక్షంగా జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు ఆరోప‌ణ‌లు చేశారు. ఉన్న ఆదాయంలో 40 శాతం ప‌న్ను చెల్లించ‌డం ద్వారా మిగిలిన సొమ్మును అధికారికం చేసుకోవ‌చ్చ‌ని ఆ రాజ‌కీయ నేత ప‌దివేల కోట్లు ప‌న్ను క‌ట్టారంటూ ఎంత పెద్దెత్తున న‌ల్ల‌ధ‌నాన్ని వైట్ చేసుకున్నారో ఆలోచించుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఏదేమైనా టీడీపీ నేతలు, మంత్రులు, చివ‌ర‌కు సీఎం కూడా ఆ ప‌దివేల కోట్ల రూపాయలు క‌ట్టింది జ‌గ‌నేన‌ని బ‌య‌ట‌పెట్టేశారు.

Loading...

Leave a Reply

*